Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పునర్నవి భూపాలం లైఫ్ స్టోరీ- డేటింగ్‌పై రాహుల్‌తో చర్చే వైరల్

Advertiesment
Punarnavi
, శుక్రవారం, 16 ఆగస్టు 2019 (13:22 IST)
పునర్నవి భూపాలం ప్రస్తుతం బిగ్ బాస్ మూడో సీజన్‌లో యంగ్ గర్ల్‌గా అదరగొట్టేస్తోంది. సినీ నటి అయిన పునర్నవి.. 1996 మార్చి 28వ తేదీన జన్మించింది. తెనాలిలో పుట్టిన ఈమె 2013లో ఉయ్యాల జంపాల ద్వారా తెరంగేట్రం చేసింది. 
 
ఈ చిత్రంలో హీరోయిన్ అవికా గోర్‌కు స్నేహితురాలిగా ఈమె కనిపించింది. ఆపై 2015 మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజులో శర్వానంద్ కూతురు పార్వతిగా కనిపించింది. 2016 పిట్టగోడ, 2016 అమ్మకు ప్రేమతో నీ సాధిక లో సాధికగా, 2018 మనసుకు నచ్చిందిలో పునర్నవి నటించింది.
 
ఇప్పటికే బిగ్ బాస్‌లో బాగా సందడి చేస్తోంది. కంటిస్టెంట్‌గా ఏం చేయాలో అది చేస్తూ ముందుకుపోతోంది. ఇటీవల ఎపిసోడ్‌లో పునర్నవి, రాహుల్‌ల మధ్య జరిగిన డేటింగ్ సంభాషణపై నెట్టింట వైరల్‌గా చర్చలు సాగుతున్నాయి. బిగ్ బాస్ హౌస్‌లో అన్ సీన్ వీడియోలు కొన్ని నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అందులో కొన్ని వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటే పునర్నవి, రాహుల్‌ల డేటింగ్ సంభాషణ. 
 
గత వారం జరిగిన ఓ ఎపిసోడ్‌లో రాహుల్, పునర్నవి, వరుణ్ సందేశ్ మధ్య సరదా సంభాషణ జరిగింది. ఆ సమయంలో రాహుల్.. పునర్నవిని ''నీతో డేటింగ్ చేయాలంటే ఏం చేయాలి..?'' అని అడిగాడు. దానికి సమాధానంగా ''నేను ఖాళీగా ఉన్నానా లేదా అన్నది తెలుసుకోవా..?" అని పునర్నవి అన్నది. అప్పుడు రాహుల్ "నువ్వు డేట్‌లో ఉన్నావా? అనగానే ఆమె అవును అని చెప్పింది.
 
ఇంకా ఈ వీడియోలో ఇందులో 'అందరూ డేటింగ్ డేటింగ్ అంటుంటే నువ్వు ఎందుకు మాట్లాడడం లేదు. నాగార్జున గారికి కూడా సమాధానం ఎందుకు చెప్పలేదు. అందరూ అంటున్నా సైలెంట్‌గా ఎందుకుంటున్నావ్' అని రాహుల్‌ను ప్రశ్నించింది పునర్నవి.
 
వాళ్లిద్దరి మధ్య జరిగిన సంభాషణను వితకకు వివరించాడు రాహుల్. 'దీనికి డేటింగ్ కోసం నన్ను ఎలిమినేట్ చేయలేదంట' అని ఆమెకు చెప్పాడు. దీంతో వితిక 'అప్పుడు నాగ్ సార్ ఏ పదం వాడారో అది చెబుతుందిరా తింగరోడా. ఆయన చేతిలో ఉన్న కోతి అనగానే ఆ పదం చెప్పి నిన్ను సేఫ్ చేశారని అంటోంది. మైండ్ పెట్టు' అని వివరించింది. దీంతో రాహుల్ పునర్నవి వైపు చూసి 'నా లైఫ్‌లో నేను ఏ అమ్మాయి వైపు చూడలేదు గుర్తు పెట్టుకో' అని అన్నాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

#PawanKalyan : "సైరా" కోసం ముందుకొచ్చిన జనసేనాని