ఎరుపు డ్రెస్‌తో మత్తెక్కిస్తున్న ప్రియాంక జవాల్కర్
, శుక్రవారం, 20 మే 2022 (18:41 IST)
నటి ప్రియాంక జవాల్కర్ తాజాగా ఫొటోషూట్ చేసుకుంది. ఎరుపు రంగులో క్లాస్సి, క్రేజీగా కనిపిస్తోంది. మంత్రముగ్ధులను చేసే అందంతో వున్న ప్రియాంక జవాల్కర్ ఓ భారీ సినిమాలో నటించడానికి ఫొటో షూట్ జరిపినట్లు తెలుస్తోంది. ఆమె విజయ్‌దేవరకొండతో టాక్సీవాలా, తిమ్మరుసు, ఎస్.ఆర్. కళ్యాణమండపం, గమనం వంటి సినిమాల్లో నటించింది. అయితే టాక్సీవాల సినిమా హిట్ అయినా ఆమెకు అంతగా పేరు రాలేదు.
ఎస్.ఆర్. కళ్యాణమండపం హిట్ అయింది. అయినా హీరోయిన్‌గా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. ఓటీటీలో విడుదలైన గమనంలో నటించింది. అది గుర్తింపు తెచ్చింది. ప్రస్తుతతం ఈ ఏడాది పేరుపొందిన బేనర్‌లో నటించడానికి సిద్ధమైందని తెలుస్తోంది. సోషల్ మీడియాలో ఫొటోషూట్ పెడుతూ, ఫొటోగ్రాఫర్ శేఖర్ జై, హెయిర్ స్టైలింగ్ చక్రపు.మధుకు ధన్యవాదాలు తెలియజేసింది.
తర్వాతి కథనం