Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Priyanka Arul : ఓజీ చిత్రం నుండి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్

Advertiesment
Priyanka Arul Mohan

దేవీ

, శనివారం, 16 ఆగస్టు 2025 (16:27 IST)
Priyanka Arul Mohan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం 'ఓజీ'. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఓజాస్‌ గంభీరగా గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తున్నారు. 
 
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఓజీ' సినిమా నుంచి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్‌ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె కన్మణిని పాత్రలో అలరించనున్నారు. 'ఓజీ' రూపంలో ఓ భారీ యాక్షన్ చిత్రాన్ని వెండితెరపై చూడబోతున్నామనే హామీని ఇప్పటిదాకా విడుదలైన ప్రచార చిత్రాలు ఇచ్చాయి. తాజాగా విడుదలైన ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఒక పోస్టర్ దయ, బలం, నిశ్శబ్దాన్ని ప్రదర్శిస్తోంది. మరో పోస్టర్ ప్రశాంతత మరియు గృహ వాతావరణాన్ని సూచిస్తుంది.
 
ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ పాత్రకు సంబంధించిన ప్రచార చిత్రాలకు అద్భుతమైన స్పందన లభించింది. ఇప్పుడు ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ కూడా కట్టిపడేస్తోంది. సుజీత్ యొక్క విస్ఫోటన కథనానికి భావోద్వేగ లోతును, ఆకర్షణను పవన్ కళ్యాణ్ మరియు ప్రియాంక అరుల్ మోహన్ జోడిస్తున్నారు. ప్రతి తుఫానుకు అవసరమైన ప్రశాంతత ప్రియాంక మోహన్ పాత్ర అని నిర్మాతలు అభివర్ణించారు.
 
ఇటీవల విడుదలైన 'ఓజీ' మొదటి గీతం 'ఫైర్‌ స్టార్మ్'కు విశేష స్పందన లభించింది. ఇప్పుడు రెండవ గీతాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. త్వరలో ప్రోమో విడుదల కానుంది.
 
ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుల్ మోహన్ తో పాటు ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి కీలక పాత్రలు పోషిస్తున్నారు. 2025లో అతిపెద్ద సినిమాటిక్ ఈవెంట్‌గా ఇది రూపుదిద్దుకుంటోంది. సంగీత సంచలనం ఎస్. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రాహకులుగా రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస వ్యవహరిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఓజీ' చిత్రం సెప్టెంబర్ 25, 2025న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
 
తారాగణం: పవన్ కళ్యాణ్, ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, శ్రియా రెడ్డి  దర్శకత్వం: సుజీత్ 
సంగీతం: తమన్ ఎస్
ఛాయాగ్రహణం: రవి కె చంద్రన్, మనోజ్ పరమహంస 
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థ: డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
నిర్మాత: డీవీవీ దానయ్య 
పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వివాదంలోకి నెట్టిన ది బెంగాల్ ఫైల్స్ ట్రైలర్ - కొల్ కత్తాలో ప్రీరిలీజ్ వాయిదా