Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫ్రెండ్‌తో ఎంజాయ్ కోసం ర‌ష్యా వెళ్ళిన ప్రియా వారియ‌ర్‌

Advertiesment
ఫ్రెండ్‌తో ఎంజాయ్ కోసం ర‌ష్యా వెళ్ళిన ప్రియా వారియ‌ర్‌
, సోమవారం, 26 జులై 2021 (14:15 IST)
priya warioer
క‌న్ను కొట్టి ఓర చూపుతో యువ‌త‌ను మ‌త్తెక్కించిన మ‌ల‌యాళ న‌టి ప్రియావారియ‌ర్‌. ఒరు ఆడార్ ల‌వ్ అనే మ‌ల‌యాళ సినిమాతో రాత్రికి రాత్రే పాపుల‌ర్ అయిన ఆమె తెలుగు సినిమా నితిన్‌తో `చెక్‌` చేసింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో శ్రీ‌దేవి బంగ్లాలో న‌టిస్తోంది. క‌న్న‌డలో విష్ణుప్రియ‌లో న‌టించింది. ఇప్పుడు తాజాగా జాంబిరెడ్డి హీరో తేజ స‌జ్జ‌తో `ఇష్క్‌` సినిమా చేస్తోంది. ఈ సినిమా కూడా తేజ స‌జ్జ హీరో అనే ఒప్పుకున్న‌ట్లు బోల్డ్‌గా చెప్పేసింది.
 
కాగా, ఇటీవ‌లే ర‌ష్యా వెళ్ళి సోష‌ల్‌మీడియాలో హైలైట్ అయింది. త‌న‌కు చాలా కాలం త‌ర్వాత స్నేహితుల‌తో గ‌డిపే అవ‌కాశం దొరికింది. అందుకే వారికోస‌మే ర‌ష్యా వెళ్ళి ఎంజాయ్‌మెంట్ చేశాను. కేవ‌లం ఫ్రెండ్స్‌తోనే వున్నానంటూ వివ‌రించింది. ర‌ష్యాలో ఆమె రోడ్ల‌పై డాన్స్‌కూడా చేసింది. స్నేహితుల‌తో చేసిన ఆ డాన్స్ కూడా స‌ర‌దాకోస‌మే అని చెబుతోంది.

ప్ర‌స్తుతం ఆమె బాలీవుడ్ సినిమాలోనూ న‌టిస్తోంది. అందులో భాగంగా వెళ్ళిందా అనేది క్లారిటీ ఇవ్వ‌లేదు. నాకు ఫ్రెండ్స్‌తో ఎక్కువ టైం గ‌డ‌ప‌డం అంటే ఇష్ట‌మ‌ని చెబుతోంది. అయితే సోష‌ల్‌మీడియాలో ఆమె అందాల‌నుకూడా చూపించే పోస్ట్‌లు కూడా చేస్తోంది. తాను ర‌ష్యా కేవ‌లం ఫ్రెండ్స్‌తోనే వెళ్ళాను. ఫ్రెండ్‌తో కాదు అంటూ న‌వ్వుతూ స‌మాధానం చెబుతోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకూ మంచి రోజులు వ‌చ్చాయిః మెహ్రీన్