Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రెష‌ర్ కుక్క‌ర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

Advertiesment
ప్రెష‌ర్ కుక్క‌ర్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
, శనివారం, 16 నవంబరు 2019 (15:39 IST)
సాయి రోన‌క్‌, ప్రీతి అర్సాని హీరో హీరోయిన్లుగా సుజోయ్‌, సుశీల్ ద‌ర్శ‌క ద్వ‌యం తెర‌కెక్కిస్తోన్న చిత్రం `ప్రెష‌ర్ కుక్క‌ర్‌`. క‌రంపురి క్రియేష‌న్స్‌, మైక్ మూవీస్ ప‌తాకాల‌పై సుజోయ్‌, సుశీల్‌, అప్పిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 6న‌ ప్ర‌ముఖ డిస్ట్రిబ్యూట‌ర్ `అభిషేక్ పిక్చ‌ర్స్‌` అభిషేక్ నామా విడుద‌ల చేస్తున్నారు.
 
ఇటీవ‌ల ఈ సినిమా క‌థ న‌చ్చ‌డంతో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఈ సినిమా టీజ‌ర్‌ను క‌ట్ చేసి రిలీజ్ చేశారు. ఆ టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. సునీల్ క‌శ్య‌ప్‌, రాహుల్ సిప్లిగంజ్‌, స్మ‌ర‌ణ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తుండ‌గా న‌గేష్ బానెల్‌, అనిత్ మ‌డాడి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.
 
సాయిరోన‌క్‌, ప్రీతి అస్రాని, రాహుల్ రామ‌కృష్ణ‌, రజ‌య్ రోవాన్‌, తనికెళ్ల భ‌ర‌ణి, సీవీఎల్ న‌ర‌సింహారావు త‌దిత‌రులు న‌టిస్తున్న ఈ చిత్రానికి ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: సుజోయ్‌, సుశీల్‌, నిర్మాత‌లు: సుశీల్‌, సుజోయ్‌, అప్పిరెడ్డి, సినిమాటోగ్ర‌పీ: న‌గేష్ బానెల్‌, అనిత్ మ‌డాడి, సంగీతం: సునీల్ క‌శ్య‌ప్‌, రాహుల్ సిప్లిగంజ్‌, స్మ‌ర‌ణ్‌, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌, బీజీఎం: హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌, ఎడిట‌ర్‌: న‌రేష్ రెడ్డి జొన్న‌

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ట్విట్టర్ ట్రెండింగ్‌లో #SarileruNeekevvaruTeaser..