Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ప్రేమతో మీ కార్తీక్' ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన

జీవితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు. అనే విషయాన్ని తెలియజెప్పే విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రం 'ప్రేమతో మీ కార్తీక్'. రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్‌లో గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవ

'ప్రేమతో మీ కార్తీక్' ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన
, మంగళవారం, 7 మార్చి 2017 (16:04 IST)
జీవితంలో కెరీర్ ఒక భాగం మాత్రమే. అదే జీవితం కాదు. అనే విషయాన్ని తెలియజెప్పే విలువలతో కూడిన కుటుంబ కథా చిత్రం 'ప్రేమతో మీ కార్తీక్'. రమణశ్రీ ఆర్ట్స్ బ్యానర్‌లో గీతా మన్నం సమర్పణలో రమణశ్రీ గుమ్మకొండ, రవీందర్ గుమ్మకొండ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. రిషి ఈ చిత్రానికి దర్శకుడు. కార్తికేయ, సిమ్రత్, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పృథ్వీ, ప్రగతి, సుమిత్ర, రఘు కారమంచి, శత్రు, మధునందన్, ఝాన్సీ, ప్రియ, జయవాణి, ఫణి, నర్సింహరాజు, కోటేశ్వరరావు, రాఘవ తదితరులు నటించారు. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రేమతో మీ కార్తీక్ ఫస్ట్ లుక్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. 
 
ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.... ప్రేమతో మీ కార్తీక్ చిత్రాన్ని దర్శకుడు రిషి అందమైన కథతో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు. కెరీర్, ప్రేమ, కుటుంబాల మధ్య ఉండే సంబంధాల్ని చక్కగా చూపించారు. ఈ చిత్రంతో మంచి దర్శకుల లిస్టులో రిషి చేరతాడని భావిస్తున్నాం. 'భలే భలే మగాడివోయ్' తర్వాత మురళీ శర్మ అంత అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు. 
 
గొల్లపూడి మారుతి రావు చాలాకాలం తర్వాత ఒక ఎమోషనల్ క్యారెక్టర్ చేశారు. కేరళలోని వాగమన్, ఇడుక్కి ప్రాంతాల్లో కూర్గ్‌లో ఇప్పటివరకు ఎవ్వరూ షూట్ చేయని అందమైన లొకేషన్స్‌లో షూట్ చేయడం జరిగింది. మలయాళంలో సక్సెస్‌ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ షాన్ రెహమాన్ అందించిన పాటలు హైలైట్‌గా నిలుస్తాయి. సాయి ప్రకాష్ ఉమ్మడి సింగు సినిమాటోగ్రఫీ మరో హైలైట్‌గా ఉంటుంది. కేరళ, కూర్గ్, గోవా, హైదరాబాద్‌లో ఈ సినిమా చిత్రీకరణ జరిగింది. చిత్ర షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వేసవి కానుకగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ఆయన వివరించారు. 
 
ఈ చిత్రంలో కార్తికేయ, సిమ్రత్, మురళీ శర్మ, గొల్లపూడి మారుతీ రావు, పృథ్వీ, ప్రగతి, సుమిత్ర, రఘు కారమంచి, శత్రు, మధునందన్, ఝాన్సీ, ప్రియ, జయవాణి, ఫణి, నర్సింహరాజు, కోటేశ్వరరావు, రాఘవ తదితరులు నటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

"పిశాచి-2" పాటలను విడుదల చేసిన కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ