Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Poonam Kaur: పుష్ప -2 ‌పై పూనమ్ కౌర్ ప్రశంసలు.. జాతర సీన్ అదిరింది.. స్పందించేదేలే!

poonam kaur

సెల్వి

, ఆదివారం, 22 డిశెంబరు 2024 (19:40 IST)
టాలీవుడ్ ప్రముఖ నటి పూనమ్ కౌర్ పుష్ప 2 సినిమాపై స్పందించారు. చిత్ర బృందానికి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా చేసింది. మొత్తానికి పుష్ప 2 సినిమా చూశాను. తెలంగాణలో సమ్మక్క సారలక్క జాతర ఎలాగో.. గంగమ్మ జాతరను అక్కడ అంత బాగా చూపించారు.
 
మన ఆచార, సంస్కృతి, సంప్రదాయాలను చాలా బాగా చూపింరు ఈ సినిమాలో. అల్లు అర్జున్ కంటే గొప్పగా ఇంకెవ్వరూ అలా నటించలేరు అంటూ పుష్ప 2 సినిమాపై, బన్నీ పై ప్రశంసల వర్షం కురిపించింది పూనమ్ కౌర్. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట బాగా వైరల్‌గా మారింది. 
 
అయితే పూనమ్ కౌర్ ఈ ట్వీట్ చేసిన మూవీ మేకర్స్ ప్రస్తుతం స్పందించే పరిస్థితులలో లేరు. అందుకు గల కారణం కూడా మనందరికీ తెలిసిందే. పుష్ప 2 సినిమాను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్స్ లో భాగంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. అలాగే ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సంధ్య థియేటర్‌ నుంచి బయటికి అల్లు అర్జున్‌.. సీసీ టీవీ దృశ్యాలు వైరల్‌ (video)