Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాతృమూర్తి ప్రభావతి 90వ జన్మదినోత్సవాన్ని నిర్వహిస్తున్న కళా దర్శకుడు "పేకేటి రంగా"

Advertiesment
peketi ranga
, సోమవారం, 21 డిశెంబరు 2015 (17:28 IST)
నటుడిగా, దర్శకుడిగా..  నిన్న, మొన్నటి తరాల వారికి సుపరిచితులైన బహుముఖ ప్రతిభాశాలి. "పేకేటి శివరాం". "భైరవ ద్వీపం, ఆదిత్య 369, నిన్నే పెళ్ళాడతా, నువ్వు నాకునచ్చావ్" వంటి చిత్రాలకు "ఆర్ట్ డైరెక్టర్"గా పని చేసిన  సుప్రసిద్ధ కళా దర్శకుడు పేకేటి రంగా.. "స్వర్గీయ పేకేటి శివరాం"గారి తనయుడు కాగా, తెలుగు, తమిళ భాషల్లో సుప్రసిద్ధ కథానాయకుడు "ప్రశాంత్" (జీన్స్, చామంతి ఫేం) పేకేటి శివరాంకు స్వయాన మేనల్లుడు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో ప్రఖ్యాతిగాంచిన నటీమణి, నిన్నటితరం కథానాయకి జయంతి.. పేకేటి శివరాం రెండో భార్య. 
 
స్వర్గీయ పేకేటి శివరాం మొదటి భార్య, పేకేటి రంగా మాతృమూర్తి శ్రీమతి ప్రభావతి ఈ నెల 26తో 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా శ్రీమతి ప్రభావతి పుట్టిన రోజు వేడుకను.. ఈ నెల 26 (ఆదివారం)సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అత్యంత ఘనంగా నిర్వహించేందుకు "పేకేటి ఫ్యామిలీ" సన్నాహాలు చేస్తున్నారు. మేడ్చల్ రోడ్‌లో, సుచిత్ర అకాడమి పక్కన గల, "హోటల్ స్వాగత్ గ్రాండ్" ఇందుకు వేదిక కానున్నది. తెలుగు, కన్నడ చిత్ర పరిశ్రమలో "పేకేటి ఫ్యామిలీ"తో సన్నిహిత సంబంధాలు కలిగినవారంతా ఈ వేడుకలో పాలుపంచుకొంటున్నారు. మిత్రులు, శ్రేయోభిలాషులు కూడా ఈ వేడుకలో పాల్గొని తమను ఆనందింపజేయవల్సిందిగా పేకేటి రంగా ఓ ప్రకటనలో విజ్ఞప్తి చేసారు.

Share this Story:

Follow Webdunia telugu