Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ ముగ్గురు హీరోలతో చేయాలనివుంది : 'ఆర్ఎక్స్ 100' భామ

Advertiesment
ఆ ముగ్గురు హీరోలతో చేయాలనివుంది : 'ఆర్ఎక్స్ 100' భామ
, ఆదివారం, 16 ఆగస్టు 2020 (10:44 IST)
తెలుగు వెండితెరపైకి మెరుపు తీగలా దూసుకొచ్చిన భామ పాయల్ రాజ్‌పుత్. 'ఆర్ఎక్స్100' అనే మూవీ ద్వారా ఆమె టాలీవుడ్‌కు పరిచయమైంది. అందం, అభినయం ఆమె సొంతం. పైగా, అందాలను ఆరబోయడానికి ఏమాత్రం వెనుకంజ వేయడం లేదు. 'ఆర్ఎక్స్100' చిత్రంలో ఈ విషయాన్ని ఆమె నిరూపించింది. ఈ చిత్రం తొలి చిత్రమే అయినప్పటికీ ఏమాత్రం సిగ్గు, బెణుకు లేకుండా అందాలను ఆరబోసి, కుర్రకారును గిలిగింతలు పెట్టింది. 
 
ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ - నాగచైత్యలు కలిసి నటించిన 'వెంకీమామ' చిత్రంలో ముదురు హీరో సరసన నటించి మెప్పించింది. తాజాగా సోషల్ మీడియా ద్వారా పాయల్ తన అభిమానులతో ముచ్చటించింది. ఈ సందర్భంగా తెలుగు హీరోల్లో ఎవరితో నటించాలని ఉందని పాయల్‌కు ఒక ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, ప్రభాస్ సరసన నటించాలనుందనే కోరికను ఆమె వ్యక్తం చేసింది. స్టార్ హీరోలతో పని చేయాలనే ఈ అమ్మడి కోరిక మరి ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిహారిక నిశ్చితార్థానికి బాబాయ్ పవర్ స్టార్ ఎందుకు రాలేదంటే...