Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తమిళంలోకి పవన్ కళ్యాణ్ చిత్రం రీమేక్.. అత్తగా ఖుష్బూ!

త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అత్తారింటికి దారేది". ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెంటిమెంట్‌, కామెడీ, ఎమోష‌న్స్‌తో కూడిన ఈ చిత్రం విమ‌ర్

Advertiesment
తమిళంలోకి పవన్ కళ్యాణ్ చిత్రం రీమేక్.. అత్తగా ఖుష్బూ!
, మంగళవారం, 14 ఆగస్టు 2018 (10:43 IST)
త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "అత్తారింటికి దారేది". ఈ చిత్రం ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సెంటిమెంట్‌, కామెడీ, ఎమోష‌న్స్‌తో కూడిన ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. అలాంటి చిత్రం ఇపుడు తమిళంలోకి రీమేక్ కానుంది.
 
స్టార్ డైరెక్ట‌ర్ సుంద‌ర్‌.సి ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ రీమేక్ తెర‌కెక్క‌నుండ‌గా, ప‌వ‌న్ పాత్ర‌ని శింబు చేయ‌నున్నాడ‌ట‌. తొలిసారి సుంద‌ర్ ‌- శింబు జ‌త‌క‌ట్ట‌డంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. అయితే తెలుగు వ‌ర్షెన్‌లో నదియా పోషించిన సునంద (అత్త) పాత్రని తమిళంలో కుష్బూ పోషిస్తున్నారని సోషల్‌మీడియాలో పుకార్లు షికారు చేశాయి. కానీ ఈ వార్తలను ఆమె తోసిపుచ్చారు. ఇంతకీ ఈ చిత్ర దర్శకుడు సుందర్ సి... నటి ఖుష్బూ భర్త కావడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మ‌న్మ‌థుడు 2లో హీరో ఎవ‌రు..?