దంగల్ సినిమా చూశా.. మనస్సాక్షి ఒప్పుకోవట్లేదు.. అమీర్ ఖాన్ నటన అదుర్స్: పవన్
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన అమీర్ ఖాన్ నటించిన దంగల్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. తొలివారం 197.53 కోట్ల రూపాయలను వస
బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకడైన అమీర్ ఖాన్ నటించిన దంగల్ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విమర్శకుల ప్రశంసలు పొందిన ఈ సినిమా రికార్డు వసూళ్లు సాధిస్తోంది. తొలివారం 197.53 కోట్ల రూపాయలను వసూలు చేయడం ద్వారా దంగల్ సినిమా ఈ ఏడాది తొలి వారంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సినిమా సుల్తాన్ తొలివారంలో 180.36 కోట్ల రూపాయలు వసూలు చేయగా, దంగల్ ఈ రికార్డును బ్రేక్ చేసింది.
ఇకపోతే.. అమీర్ ఖాన్ దంగల్ సినిమాపై సెలెబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమా బృందంపై సినీ నటుడు పవన్‌కల్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. అద్భుతమైన జీవిత కథతో మంచి విజయం అందుకున్న అమీర్ ఖాన్‌కు, ఆయన బృందానికి పవన్ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మనసుల్ని కదిలించేలా చిత్రాన్ని తీశారంటూ దర్శకుడు నితీశ్ తివారీని, మిగిలిన చిత్ర బృందాన్ని అభినందించారు చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ఫాతిమా సనా షేక్, సన్యా మల్హోత్రాని ప్రత్యేకించి అభినందించారు. 'దంగల్'ని చూశానని, చిత్రంపై తన అభిప్రాయాన్ని పంచుకోకపోతే మనస్సాక్షి ఒప్పుకోదనిపించిందని తెలిపారు.
అమీర్ ఖాన్ చక్కని నటనతో ప్రపంచ వ్యాప్తంగా లక్షల మంది హృదయాల్ని దోచుకున్నారని పవన్ కొనియాడారు. ఇలాంటి నటుడు మన దేశంలో ఉండటం దేశానికే గర్వకారణమని తెలిపారు.