టాలీవుడ్ స్టార్ హీరోలపై హీరోయిన్ ప్రణీత ప్రశంసల వర్షం కురిపించింది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రణీత తెలిపింది. ఇతర హీరోల విషయానికి వస్తే.. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు అందగాడని, జూనియర్ ఎన్టీఆర్ రాక్ స్టార్ అని.. డ్యాన్స్‌లో ఎన్టీఆర్, బన్నీ ఇద్దరూ ఇద్దరేనని కితాబిచ్చింది. ప్రభాస్ సూపర్ స్టార్ అని కొనియాడింది.
బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్ అంటే చాలా ఇష్టమని తెలిపింది. తమిళంలో హీరో అజిత్ తనకు ఎంతో ఇష్టమని.. తమిళ భాష తనకు అర్థం కాకపోయినా ఆయన నటించే సినిమాలన్నీ చూస్తుంటానని చెప్పింది. మహేష్ బాబు గురించి ఒక్క పదంలో చెప్పమంటే ‘హ్యాండ్‌సమ్’ అని బదులిచ్చింది. ఇంకా ప్రణీతను ఫ్యాన్స్ అడిగిన ప్రశ్నలు, ఆమె చెప్పిన సమాధానాలు ఇలా ఉన్నాయి.
బోర్ కొట్టినప్పుడు బిసిబెలెబాత్ చేసుకుని తింటానని.. ధోనీ వచ్చే ప్రపంచ కప్‌లో ఆడాలని కోరుకుంటానని చెప్పింది. కరోనా గురించి మాట్లాడుతూ.. 24 మూవీ వాచ్ దొరికితే.. కాలాన్ని వెనక్కి తీసుకెళ్లి చైనాను శాకాహారిగా మార్చేస్తానని తెలిపింది. పెసరట్టు తనకు ఇష్టమైన వంటకమని ప్రణీత చెప్పుకొచ్చింది.
సమంత గురించి మాట్లాడుతూ.. ఎంతో కష్టపడి పనిచేస్తుంది. ఆమెతో కలిసి కొన్ని సినిమాల్లో నటించాను. ఆమె అంటే ఎంతో గౌరవం, స్ఫూర్తిదాయకమని ప్రణీత వెల్లడించింది. కాఫీ అంటే తెగ ఇష్టమని ఆమె వెల్లడించింది.