Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'మొసలి'ని వేటాడేందుకు నీటిలోని 'చేప'లను చంపేస్తారా? నోట్ల రద్దుపై పరుచూరి గోపాలకృష్ణ నీతి కథ!

ప్రస్తుతం దేశంలో ప్రతిఒక్కరూ నోట్ల రద్దు గురించే మాట్లాడుకుంటున్నారు. నల్లధనం నిర్మూలన కోసం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ఈ నెల 8న రాత్రి ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. ఆ రాత్రి మోడీ ప్రకటన

'మొసలి'ని వేటాడేందుకు నీటిలోని 'చేప'లను చంపేస్తారా? నోట్ల రద్దుపై పరుచూరి గోపాలకృష్ణ నీతి కథ!
, శుక్రవారం, 18 నవంబరు 2016 (14:05 IST)
ప్రస్తుతం దేశంలో ప్రతిఒక్కరూ నోట్ల రద్దు గురించే మాట్లాడుకుంటున్నారు. నల్లధనం నిర్మూలన కోసం రూ.1000, రూ.500 నోట్లను రద్దు చేస్తూ ఈ నెల 8న రాత్రి ప్రధాని మోడీ సంచలన ప్రకటన చేశారు. ఆ రాత్రి మోడీ ప్రకటన విని సామాన్యులంతా హర్షించారు. మోడీ గ్రేట్ అంటూ ఆకాశానికెత్తేశారు. అయితే మూడురోజుల తర్వాత హర్షించినవారే విమర్శిస్తున్నారు. నోట్ల మార్పిడి కోసం గంటల తరబడి.. కాదు కాదు రోజుల తరబడి పనులన్నీ మానుకుని క్యూలైన్‌లో నిలబడే సరికి హర్షించిన వాళ్లే మోడీ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈపరిస్థితుల్లో తాజాగా ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ నోట్లరద్దు నిర్ణయంపై ఓ నీతికథను వివరించారు. ఆ కథ ఉన్నది మూడు ముక్కలే అయినా... అందులో చాలా పరమార్థం దాగుంది. ఓ రైతును ఉదాహరణగా తీసుకుని రెండు లైన్ల నీతి వాక్యాన్ని రాశారు. ‘చెరువులో మొసలి ఉందని నీళ్లు మొత్తం తోడించేశాడు రైతు!. చేపలు చచ్చిపోయాయి!.. మొసలి పారిపోయింది. ఈ కథలో నీతి ఉంది కనిపెట్టండి.’ అంటూ పరుచూరి గోపాలకృష్ణ సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. 
 
‘ఎవరో దొంగనోట్లు దాచుకున్నారని.. రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే రైతులకెందుకీ కష్టం. కూలి పనికి పోనిదే పూట గడవని సామాన్యుడికెందుకీ కష్టం. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న వాళ్లు ఏం పాపం చేశారు. నల్లధనాన్ని వెనకేసుకున్నారా? నిజంగానే నల్లధనాన్ని వెనకేసుకున్నవాళ్లు.. కనీసం ఒక్కరైనా ఇలాంటి కష్టాలు పడినట్లు ఎక్కడైనా వచ్చిందా? నల్లధనం అంటే ఏమిటో కూడా తెలియని గ్రామాల్లో నివసించే వృద్ధులు కూడా తామేదో తప్పు చేసినట్లు బ్యాంకుల ముందు పడిగాపులు కాయడమేంటి?’ అని ఈ కథలో ఉన్న నీతిని నెటిజన్లు కనిపెడుతున్నారు. ‘రైతు ఎర వేసి మొసలిని బయటకు రప్పించి చంపేసి ఉంటే చెరువులో చేపలు ప్రశాంతంగా జీవించి ఉండేవి’ అని పరుచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంతతో వ్యాపారం చేయనున్న నితిన్.. నీరజ కోన కూడా పార్ట్‌నర్‌గా?