Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పంజా వైష్ణవ్ తేజ్ చిత్రంలో చిత్రగా శ్రీలీల

Advertiesment
Srileela
, శనివారం, 13 మే 2023 (12:41 IST)
Srileela
బ్లాక్ బస్టర్ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, మెగా చార్మింగ్ హీరో పంజా వైష్ణవ్ తేజ్‌తో ఓ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను నిర్మిస్తోంది. శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహ నిర్మాతగా వ్యవహరిస్తోంది. ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు. నిర్మాతలు నాగ వంశీ, సాయి సౌజన్య ఎక్కడా వెనకాడకుండా.. ప్రేక్షకులకు థియేటర్లలో అద్భుతమైన అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతో అత్యున్నత స్థాయిలో చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రాన్ని ఆయన అదిరిపోయే మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా తెరకెక్కిస్తున్నారు. శ్రీలీల కథానాయికగా నటిస్తున్నారు. సినిమాకి కీలకమైన పవర్ ఫుల్ పాత్రలలో జోజు జార్జ్, అపర్ణా దాస్ నటిస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని.. సినిమాపై అంచనాలను పెంచేశాయి.
 
అసురన్‌, ఆడుకలం వంటి జాతీయ అవార్డులు గెలుచుకున్న చిత్రాలకు సంగీతం అందించిన జి.వి. ప్రకాష్‌ కుమార్‌ మరోసారి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ తో చేతులు కలిపారు. ఇటీవల వీరి కలయికలో వచ్చిన సార్/వాతి చార్ట్‌బస్టర్‌ గా నిలిచింది.
 
ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న శ్రీలీల పాత్ర వివరాలను తాజాగా చిత్ర బృందం వెల్లడించింది. ఇందులో ఆమె ఉల్లాసభరితంగా, కొంటెగా ఉంటూ అందరి మనసులు దోచుకునే అందమైన 'చిత్ర' పాత్రను పోషిస్తున్నారు. తాను పోషిస్తున్న చిత్ర పాత్ర పట్ల శ్రీలీల ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ఇప్పటిదాకా చిత్రీకరించిన ఆమె పాత్రకు సంబంధించిన సన్నివేశాలన్నీ అద్భుతంగా వచ్చాయి.
 
త్వరలోనే ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసేలా ఈ మూవీ నుంచి అదిరిపోయే యాక్షన్ గ్లింప్స్ విడుదల కానుంది. ఎ.ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. PVT04 నుంచి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ పల్లె కథతో తురమ్ ఖాన్ లు షూటింగ్ పూర్తి