Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేటి, రేపటి తరానికి కూడా ఆదర్శం పద్మభూషణ్ బాలకృష్ణ

Advertiesment
Balakrishna at deli house

దేవీ

, మంగళవారం, 29 ఏప్రియల్ 2025 (17:58 IST)
Balakrishna at deli house
నటసింహం నందమూరి బాలకృష్ణ నిన్నటి నుంచి 'పద్మభూషణ్ బాలకృష్ణ' అయ్యారు. భారతదేశ మూడవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మభూషణ్ పురష్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందుకున్నారు. యాభై ఏళ్ళ సీనికెరీర్ కు చేరుకోవడం అవార్డు దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ సీనియర్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణ.. గత 50 ఏళ్లుగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్నారు. సినీ రంగంతో పాటుగా రాజకీయ రంగం, సామాజిక సేవలలో ఆయన చేసిన విశిష్ట సేవలకు గుర్తుగా 'పద్మభూషణ్' పురష్కార గౌరవం లభించింది. 
 
కాగా, కుటుంబసమేతంగా ఢిల్లీ వెళ్ళిన బాలక్రిష్ణ ఆ సాయంత్రం ఢిల్లీలో ప్రముఖ రాజకీయనాయకులు, ప్రముఖుల సమక్షంలో విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బాలక్రిష్ణ, భార్య వసుంధర దేవి, కుమార్తె తేజ్వసిని, ఆమె భర్త ఎం.పి. భరత్, తెలుగు దేశం మంత్రులు ఆ వీడియోలో కనిపించారు. ఈ సందర్భంగా బాలక్రిష్ణ మాట్లాడుతూ, నాన్నగారు ఏ సినిమా చేసినా ఆయన కనిపించేవారు కాదు. పాత్రే కనిపించింది. బొబ్బిలిసింహం కానీ మరే సినిమా కానీ ఆయన పాత్రలో లీనమైపోయేవారు. అలా నేను ఆయన్నుంచి పుణికి పుచ్చుకున్నాను అన్నారు. 
 
తెలుగుదేశం కేంద్ర మంత్రి నాయుడు మాట్లాడుతూ, నేను ఎక్కువగా సినిమా చూడను. కానీ మీరు నటించిన మంగమ్మ శపథం, మంగమ్మగారి మనవడు వంటి సినిమాలు చూశాను. మీ డెడికేషన్ కు హాట్సాప్. తెలుగు సినిమా రంగంలో ఎంతో మంది నటులున్నారు. ఇప్పుడు కొత్తతరం కూడా ముందుకుసాగుతున్నారు. రేపు వచ్చే తరానికి కూడా మీరు మార్గదర్శకం అవుతున్నారని.. ప్రశంసించారు. దానితో బాలక్రిష్ణ మహదానందంతో తన తండ్రి గురించి, తన గురించి పలు విషయాలను మాట్లాడారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

NTR: ఎన్టీఆర్‌ నీల్‌ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్‌ విడుద‌ల‌ తేదీ ప్రకటన