Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరుణ్ అదిత్ `డియర్ మేఘ`కు ఓటీటీ ఆఫ‌ర్‌

Advertiesment
Arun Adit
, మంగళవారం, 8 జూన్ 2021 (13:28 IST)
Dear Megha
క‌థ‌, 24 కిసెస్‌, సినిమాల హీరో అరుణ్ ఆదిత్ తాజాగా న‌టిస్తున్న సినిమా `మేఘ‌`. అర్జున్ సోమయాజుల ప్రధాన పాత్రల్లో న‌టించారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఫస్ట్ కాపీ రెడీ అవుతున్న ఈ చిత్రానికి ఓటీటీ ఆఫర్స్ వెల్లువలా వస్తున్నాయి. 'వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్', ''డియర్ మేఘ'' చిత్రాన్ని నిర్మిస్తుంది. అర్జున్ దాస్యన్ నిర్మాత. సుశాంత్ రె డ్డి దర్శకత్వం వహించారు. హీరో అరుణ్ ఆదిత్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర న్యూ పోస్టర్ ను రిలీజ్ చేశారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ, అరుణ్ ఆదిత్ పాత్ర చాలా బాగుంటుంది. నటన ఆడియెన్స్ ను మెస్మరైజ్ చేస్తుంది అన్నారు. నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ, మా హీరో అరుణ్ ఆదిత్ కు పుట్టనరోజు శుభాకాంక్షలు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో సహా కంప్లీట్ అయ్యింది. త్వరలో ఓ బిగ్ ఓటీటీ ప్లాట్ ద్వారా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. ఓ అందమైన, ఆసక్తికరమైన ప్రేమకథగా ''డియర్ మేఘ''ను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారని నమ్మకంతో ఉన్నాం. అన్నారు.
 
ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - పీఎస్ వర్మ, పీఆర్వో - జీఎస్కే మీడియా. రచన,దర్శకత్వం : సుశాంత్ రెడ్డి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోట‌శ్రీ‌నివాస‌రావు రూటులో రాజేంద్ర‌ప్ర‌సాద్‌