Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓరి దేవుడా ఎలా వుందంటే, రివ్యూ రిపోర్ట్‌

Advertiesment
Ori Devauda
, శుక్రవారం, 21 అక్టోబరు 2022 (16:07 IST)
Ori Devauda
నటీనటులు: విశ్వక్సేన్-మిథిలా పాల్కర్-ఆశా భట్-మురళీ శర్మ-రాహుల్ రామకృస్ణ-నాగినీడు-వెంకటేష్ కాకుమాను-విక్టరీ వెంకటేష్ (క్యామియో) తదితరులు
 
సాంకేతిక‌తః సంగీతం: లియాన్ జేమ్స్,  ఛాయాగ్రహణం: విధు అయ్యన్న, మాటలు: తరుణ్ భాస్కర్, నిర్మాతలు: ప్రసాద్ వి.పొట్లూరి-దిల్ రాజు, రచన-దర్శకత్వం: అశ్వత్ మారిముత్తు

 
కథ:
అర్జున్ (విశ్వక్సేన్).. అను (మిథిలా పాల్కర్), మ‌హి (ఆశా భట్) చిన్నన్నాటి స్నేహితులు. అను తనను ఇష్టపడడంతో ఆమెతో పెళ్లికి ఓకే అంటాడు అర్జున్. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. కానీ అను పట్ల అర్జున్ కు ఎలాంటి ఫీలింగ్స్ ఏర్పడవు. వారి కాపురంలో కలహాలు రేగుతాయి. ఇద్దరూ విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆమెతో విడిపోవడానికి సిద్ధపడ్డ అర్జున్ కు ఒక దైవదూత (వెంక‌టేష్‌) రెండో అవకాశం ఇస్తాడు. ఆ ఛాన్స్ ఏంటి.. దాని వల్ల అర్జున్ జీవితం ఎలా మలుపు తిరిగింది.. చివరికి అనుతో అతడి ప్రయాణం ఏ మజిలీకి చేరింది అన్నది మిగతా కథ.
 

విశ్లేషణ:
తమిళంలో '12 బి' అనే సినిమాకు రీమేక్ ఇది. అందులో హీరో ఉద్యోగం కోసం బ‌స్ ఎక్కాల‌నుకుంటే మిస్ అవుతుంది. కానీ మిస్ కాకుండా వుంటే ఏమ‌వుతుంది? అనేది పాయింట్‌. 'ఓరి దేవుడా' కాన్సెప్ట్ ఇంచుమించు అంతే. ఆ త‌ర్వాత కొన్నాళ్ళ‌కు  'ఓ మై కడవులే' చిత్రం వ‌చ్చింది. ఈ దర్శకుడు అశ్వథ్ మారిముత్తు ఇప్పుడు తెలుగులో 'ఓరి దేవుడా' పేరుతో రీమేక్ చేశాడు. జీవితంలో సెకండ్ ఛాన్స్ అనేది ఉండి.. జీవితాలను చక్కదిద్దుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందనే పాయింట్ దేవుడు, మాన‌వుడు హెల్ప్ చేయ‌డం అనే ఫాంట‌సీ అంశాలు ప్రేక్ష‌కుడిని ఆక‌ట్టుకుంటాయి. అలానే త‌ను న‌మ్మి తీశాడు.

 
-  కథలో వచ్చే మలుపులు కొత్తగా అనిపించినా అంత‌కుముందు జ‌రిగే స‌న్నివేశాలు రొటీన్‌గా వుండంతో కాస్త బోర్‌నూ క‌లిగిస్తుంది ప్రథమార్ధంలో చాలా వరకు వినోదాన్ని పంచేవి ఆ సన్నివేశాలే. ఇక భార్యా భర్తల మధ్య అభిప్రాయ భేదాలు.. గొడవలు.. అపార్థాలు.. ఆపై విడాకుల కోసం కోర్టు మెట్లెక్కడం.. ఇదంతా మామూలు వ్యవహారమే. ఎప్పుడైతే ఫాంట‌సీ తోడ‌యి వెంక‌టేష్‌, అత‌ని అనుచ‌రుడు రాహుల్ రామ‌కృష్ణ కేరెక్ట‌ర్లు ఎంట‌ర్ అయ్యాయో కాస్త ఆస‌క్తిగా అనిపిస్తుంది. అర్జున్‌కు వెంక‌టేస్ ఇచ్చిన ఓ లాకెట్ నిజం చెబితేనే అత‌ని ద‌గ్గ‌ర వుంటుంది. లేదంటే ఎగిరిపోతుంది. ఈ క్ర‌మంలో సాగే స‌న్నివేశాలు కాస్త ఎంట‌ర్‌టైన్ చేస్తాయి


- హీరోయిన్ తండ్రికి సంబంధించిన నేపథ్యంలో  అందులోని ఎమోషన్ ప్రేక్షకులను కదిలిస్తుంది. చాలా హృద్యంగా అనిపించే ఈ సన్నివేశాలను దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. ఐతే ఇక్కడ ఎమోషనల్ టర్న్ తీసుకునే సినిమా చివరి దాకా ప్రేక్షకులను అదే మూడ్ లో ఉంచుతుంది. హీరోలో రియలైజేషన్ రావడం మొదలయ్యాక.. ప్రతి సన్నివేశం అదే తరహాలో నడుస్తుంది. సెకండాఫ్‌లో అర్జున్ మ‌ర‌లా అనుతో క‌లిసి కేర‌ళ వెళ్ళి అక్క‌డ క్లాస్ మేట్స్‌ను క‌లిసి వీడియో తీసే స‌న్నివేశాలు కేవ‌లం మ‌ర‌లా ఇద్ద‌రినీ క‌లిపే ప్ర‌య‌త్నం అని తెలిసిపోతుంది. ఎక్క‌డా ట్విస్ట్ వుండ‌దు. త‌న ఫ్రెండ్‌ను క‌లిపేందుకు చేసిన ప్ర‌య‌త్నం వ‌ల్లే అర్జున్ జీవితం మ‌ర‌లా విడాకులు లేకుండా సాఫీగా ముగింపుకు చేరుకోవ‌డం అనే పాయింట్‌లో చిన్న‌పాటి సందేశం కూడా వుంది.

 
పెర్‌ఫార్మెన్స్‌
ఇందులో విశ్వక్సేన్ బాగా నటించాడు. ఎమోషన్స్, హావభావాలు బాగా పలికించాడు. ఇద్దరు కొత్త హీరోయిన్లు నటించారు.  వారి వారి పాత్రలకు అనుగుణంగా ఆ భావాలు వ్యక్తం చేశారు. అయితే మనిషి జీవితానికి ఏమి కావాలి పరమార్థం ఏమిటి అనే విషయాన్ని మురళీ శర్మ పాత్ర ద్వారా తెలియజేయడం కీలక అంశం. టెక్నికల్గా సంగీతపరంగా బాగుంది. భార్యతో వేగలేక ఇబ్బంది పడే సగటు భర్తగా ఫ్రస్టేషన్ చూపించే సన్నివేశాల్లోనే కాక.. ఎమోషనల్ సీన్లలోనూ అతను ఆకట్టుకున్నాడు. మిథిలా పార్కర్ హీరోయిన్ లాగా కాకుండా ఒక సగటు అమ్మాయిలా కనిపిస్తుంది. పాత్రకు తగ్గట్టుగా చక్కగా నటించింది. మరో హీరోయిన్ ఆశా భట్ పర్వాలేదు.  హీరో స్నేహితుడిగా వెంకటేష్ కాకుమాను ఓకే.
 
- మాతృకకు పని చేసిన సాంకేతిక నిపుణులతోనే తెలుగు వెర్షన్ కు కూడా కొనసాగించాడు. లియాన్ జేమ్స్ సంగీతం హుషారుగా సాగింది. అనిరుధ్ పాడిన గుండెల్లోన పాట మంచి ఊపు తెస్తుంది. మిగతా పాటలు.. నేపథ్య సంగీతం కూడా బాగున్నాయి. విధు అయ్యన్న ఛాయాగ్రహణం నీట్ గా.. కలర్ ఫుల్ గా సాగింది. రెండు పెద్ద బేనర్లు కలిసి నిర్మించిన చిత్రంలో మంచి ప్రొడక్షన్ వాల్యూస్ కనిపిస్తాయి.  తరుణ్ భాస్కర్ మాటలు సహజంగా సాగాయి. దర్శకుడు తను అనుకున్నది ప్రేక్షకులను ఆకట్టుకునేలా చేశాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒకసారి చూడదగ్గ సినేమా 
రేటింగ్‌- 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్‌బీకె 107 సినిమా లేటెస్ట్ అప్డేట్