Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బర్త్‌డే బాయ్‌కు సర్‌ప్రైజ్ ... బీట్స్ ఆఫ్ "రాధే శ్యామ్"

Advertiesment
Beats Of Radhe Shyam
, శుక్రవారం, 23 అక్టోబరు 2020 (14:04 IST)
టాలీవుడ్ బర్త్‌డే బాయ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. ఈ హీరో శుక్రవారం తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అనేక సెలెబ్రిటీలు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 
 
ఈ క్రమంలో ప్రభాస్, గ్లామ‌ర్ బ్యూటీ పూజా హెగ్డే ప్రధాన పాత్ర‌ల‌లో 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ  తెర‌కెక్కిస్తున్న చిత్రం "రాధే శ్యామ్". క‌రోనా వ‌ల‌న ఆగిన ఈ మూవీ చిత్ర షూటింగ్ ఇటీవ‌ల ఇట‌లీలో ప్రారంభించారు. అన్ని జాగ్ర‌త్త‌ల‌తో షూటింగ్ జ‌రుపుతున్నారు. 
 
రూ.140 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ సొంత బ్యానర్ గోపీకృష్ణ మూవీస్‌తో పాటు సొంత సంస్థలాంటి యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు. ఇటీవ‌ల మూవీలో ప్ర‌భాస్ లుక్‌కి సంబంధించిన పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్య‌గా కనిపిస్తున్నారు. ఈ మూవీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాష‌లలో వచ్చే యేడాది ప్రేక్షకుల ముందుకురానుంది. 
 
ఇక ఈ రోజు ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చిత్రం నుండి స‌ర్‌ప్రైజ్ వీడియో మూవీ మేకర్స్ విడుద‌ల చేశారు. 'బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్' పేరుతో విడుద‌లైన ఈ వీడియో అభిమానుల ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తుంది. అర‌చేతిలో అద్భుత ప్రపంచాన్ని చూపిస్తూ ప్ర‌భాస్, పూజాల మ‌ధ్య సాగిన రొమాంటిక్ విజువ‌ల్‌ను ఆవిష్క‌రించారు. జ‌స్టిస్ ప్ర‌భాక‌ర‌న్ అందించిన సంగీతం వినసొంపుగా ఉంది. ప్ర‌భాస్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా విడుద‌లైన వీడియో అదుర్స్ అనేలా ఉంది.
webdunia
prabhas
 
ప్రభాస్‌ 20వ చిత్రంగా యూరప్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ పీరియాడికల్‌ లవ్‌స్టోరిలో ప్రభాస్‌ సరసన పూజా హెగ్దే హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రముఖ విఎఫ్‌ఎక్స్‌ టెక్నీషియన్‌ కమల్‌ కన్నన్‌ ఈ చిత్రానికి విఎఫ్‌ఎక్స్‌ విభాగంలో పని చేస్తుండడం విశేషం. ఈ సినిమా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నట్టు కనబడుతోంది. పూర్వ జన్మలో ‘రాధే శ్యామ్’గా ఉన్న హీరో, హీరోయిన్లు.. మరుసటి జన్మలో ‘విక్రమదిత్యగా, ప్రేరణగా ఉంటారని స‌మాచారం.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నా అతిపెద్ద శక్తివి నీవే నాన్నా.. నా స్థాయిని చూసి గర్విస్తున్నా : రెబెల్ స్టార్