Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పాక్‌ను పేల్చడానికి మానవ బాంబులు వాడండి.. సైన్యంలో ఎవరు చేరమన్నారు?: ఓం పూరి

బాలీవుడ్ నటుడు ఓం పూరి సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. యూరీ, బారాముల్లా ఆర్మీ స్థావరాల్లో భారత జవాన్లు చనిపోవడంపై ఓ టీవీ ఛానెల్ చర్చలో ప్రశ్నించగా ఓం పూరి స్పందించారు. వారిని ఆర్మీలో చేరమని ఎవరన్నార

Advertiesment
Om Puri Accused of Insulting Soldiers
, మంగళవారం, 4 అక్టోబరు 2016 (18:34 IST)
బాలీవుడ్ నటుడు ఓం పూరి సైన్యంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. యూరీ, బారాముల్లా ఆర్మీ స్థావరాల్లో భారత జవాన్లు చనిపోవడంపై ఓ టీవీ ఛానెల్ చర్చలో ప్రశ్నించగా ఓం పూరి స్పందించారు. వారిని ఆర్మీలో చేరమని ఎవరన్నారు? ఎవరు ఆయుధాలు పట్టుకోమన్నారు? వారినేమైనా బలవంతం చేశామా అని ఓం పూరి సమాధానమిచ్చారు. దీనిపై కలకలం రేగింది. భారత్‌కు పాకిస్థాన్‌కు మధ్య ఉన్న తేడా ఏంటనే ప్రశ్నకు తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలే నిదర్శనమని తెలిపారు. 
 
ఉరీ ఘటన నేపథ్యంలో పాక్ నటులపై బ్యాన్ విధించాలని ఎక్కువమంది తమ గొంతు విప్పితే.. మరికొందరు మాత్రం.. పాక్ నటులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేయటం కనిపిస్తుంది. దీంతో.. ఇలాంటి వ్యాఖ్యలపై హాట్ హాట్‌గా చర్చలు సాగుతున్నాయి. పాక్ సినీనటుల బ్యాన్ మీద ఒక ప్రముఖ ఛానల్ చర్చను నిర్వహించింది.

ఈ సందర్భంగా ఉరీ ఉగ్రఘటనలో చనిపోయిన 18 మంది వీర సైనికులను ఉద్దేశించి ఓం పూరి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ప్రస్తుతం పెను వివాదానికి దారి తీసేలా కనిపిస్తున్నాయి.
 
ఓంపురి చేసిన వ్యాఖ్యల్ని చూస్తే.. సైనికుల్ని ఉద్దేశించి.. వారిని ఎవరు ఆర్మీలో చేరమన్నారు? ఎవరు వారిని ఆయుధాలు పట్టుకోమన్నారు? మేమేమి జవాన్లను ఆర్మీలో చేరమని చెప్పలేదు కదా. 15 నుంచి 20 మానవ బాంబులు తయారు చేయండి. పాకిస్థాన్‌ను పేల్చటానికి వాటిని వాడండన్నారు.

పాక్ నటుల మీదా.. సెలబ్రిటీల మీదా నిజంగా నిషేధం విధించాలంటే భారత ప్రభుత్వాన్ని.. వారి వీసాల్నిరద్దు చేయమనండి అంటూ ఓం పూరి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కలకలం రేపింది. భారత సైన్యంపై అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఓంపూరిపై అంధేరీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి' ఫ‌స్ట్‌లుక్, టీజ‌ర్ రిలీజ్ డేట్ ఖ‌రారు.. బాలయ్య చేతుల మీదుగా...