సూపర్ స్టార్ మహేష్ బాబు, శ్రీలీల నటిస్తున్న గుంటూరు కారం చిత్రం నుంచి ఓ మై బేబీ సాంగ్ డిసెంబర్ 13 న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందులో భాగంగా నేడు సాయంత్రం ప్రోమో విడుదల చేశారు. ప్రోమోలో ఏ ముందంటే... బొబ్బలు పెట్టే కాఫీతో ఆనందకరమైన మెలోడీ ఓ బేబీ ప్రోమో అంటూ కాప్షన్ జోడించి విడుదల చేశారు.
శ్రీలీల అటువైపు వెళుతుంటే వెనుకనుంచి అమ్ము.. రావనగాడు. గుర్తుపెట్టుకో గుంటూరు వచ్చినప్పుడు పడుంటది.. అని తన గుండెతో చెబుతున్న ఫీలింగ్ ను వ్యక్తం చేశాడు. వెంటనే ఓ మై బేబీ అంటూ చిన్న సౌండ్ వినిపిస్తుంది. పూర్తి సాంగ్ ను ఈనెల 13 న విడుదలచేయనున్నట్లు తెలిపారు. ఈ పాటకు సంబంధించి ఓ స్టిల్ ను కూడా నిన్ననే విడుదల చేశారు. ఓ టేబుల్ పై గొడుగు కింద కూర్చున్న మహేష్ బాబును శ్రీలీల ముద్దు పెట్టుకుంటున్న సన్నివేశంగా చూపారు. ఈ సాంగ్ లో ఇద్దరూ మమేకం అయ్యారని తెలుస్తోంది. థమన్ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు.