Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#1 ON TRENDING దర్బార్ దుమ్ము ధూళి పాట.. కాపీ కొట్టారా? (Video)

Advertiesment
#1 ON TRENDING దర్బార్ దుమ్ము ధూళి పాట.. కాపీ కొట్టారా? (Video)
, గురువారం, 28 నవంబరు 2019 (14:46 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార జంటగా నటిస్తున్న దర్బార్ నుంచి తొలిపాటని విడుదల చేసింది చిత్ర బృందం. 'దుమ్ము ధూళి' అంటూ సాగే ఈ పాట నిజంగా దుమ్మురేపుతుంది. ప్రముఖ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం ఈ పాటని తెలుగు, తమిళ భాషలలో ఆలపించారు. అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. 
 
అలాగే నివేదా థామస్ కీలక పాత్రలో కనిపించే ఈ పాత్రలో సునీల్ శెట్టి, తంబీ రామయ్య, యోగి బాబు, ప్రతీక్ బబ్బర్, నవాబ్ షా ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాను ప్రమోషన్ చేసే పనుల్లో సినీ యూనిట్ బిజీగా వుంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ బేనర్‌పై సుబస్కరన్ నిర్మిస్తున్నారు. మురగదాస్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 
 
ఇక తాజాగా ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట పాత పాటల నుంచి కాపీ కొట్టింది. లిరిక్స్ కాపీ అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. అయినా సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో అదరగొడుతోంది. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు.. రామ్ గోపాల్ వర్మ టార్గెట్ ఏంటి?