స్టెప్‌లతో అదరిస్తున్న నోరా ఫతేహి
, సోమవారం, 3 మే 2021 (22:54 IST)
బాలీవుడ్ డాన్సర్ నటి నోరా ఫతేహి. డాన్స్ చేయడంలో దిట్ట. ఇటీవలే తను చేసిన డాన్స్‌లను సోషల్‌మీడియా పెట్టి అభిమానులను అలరిస్తోంది. ఆమె తన హెయిర్‌స్టైలిస్ట్ మార్స్ పెడ్రోజోతో కలిసి చేసిన ఈ సరదా వీడియోను సోషల్ మీడియాలో పంచుకుంది. పాశ్చాత్య సంగీతానికి అనుగుణంగా `బోకీ బోకీ.. బాకా బాకా..` అంటూ మార్క్ పాడుతుంటే నోరా దానికి అనుగుణంగా స్టెప్‌లతో రక్తికట్టించింది.
అయితే తాజా సమాచారం ప్రకారం నోరా `కెజిఎఫ్.2`లో నటించడానికి సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఆమె ఓ ఐటంసాంగ్‌లో నటించనున్నది. అందుకు సంబంధించిన పాటకానీ, ప్రాక్టీస్‌గానీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. నోరా 'సత్యమేవ జయతే' చిత్రంలోని 'దిల్ బర్' అనే స్పెషల్ సాంగ్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఆమె స్టెప్పులేసిన పాటలలో 'కమరియా, ఓ సాకి సాకి' యూట్యూబ్ లో సంచలనం సృష్టించాయి. ప్రస్తుతం 'భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా' చిత్రంలో ఓ కీలకపాత్ర చేస్తోంది నోరా.
తర్వాతి కథనం