హీరో సత్యదేవ్ నటించిన సినిమా `గాడ్సే`. బ్లఫ్ మాస్టర్ దర్శకుడు గోపీ గణేష్ దర్శకత్వం వహించారు. సమాజంలో ముఖ్యంగా విద్యావిధానం వల్ల నిరుద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార నేపథ్యంలో ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మించారు. ఈనెల 17న విడుదలకాబోతున్న ఈ చిత్రం గురించి సత్యదేవ్ ఇలా తెలియజేస్తున్నారు.
- మన రాజ్యాంగంలో ఎన్నో రూల్స్ పెట్టారు. కానీ అందులో చాలామటుకు ఎవ్వరూ సరిగ్గా ఆచరించడంలేదు. ప్రశ్నించే పౌరుడిగా నేను ఈ సినిమాలో చేసిన ప్రయత్నమే గాడ్సే. గాంధీ కాలానికి చెందిన గాడ్సే కథకు దీనికి సంబంధంలేదు. కానీ సినిమా చూశాక ఈ టైటిల్ బాగుందని మీరే అంటారు.
- నేను రూల్స్ పాటిస్తాను. కారులో వెళుతున్నప్పుడు రెడ్‌లైట్ పడితే ఆగిపోతాను. ట్రాఫిక్ ఏమీ లేకపోయినా దాన్ని ఫాలో అవుతాను. ఇలా చాలామంది ఫాలో అవుతున్నా ఎక్కువమంది చూసీచూడనట్లుగాగా గీత దాటేస్తారు. ఇది సరైందికాదు.
- నాకు తెలిసి నేను కాలేజీ చదివేరోజులనుంచి నిరుద్యోగ సమస్య వుంది. ఇప్పటికీ ఇంకా కొనసాగుతుంది. వారిలో ఎటువంటి మార్పులేదు. అసలు ఏ చదవు వల్ల ఏమి వస్తుందో ఎవరికీ తెలీదు. అసలు చదువుకు, చేసే పనికి పొంతనేలేదు.
- చాలామంది చదువు అయ్యాక లైఫ్ ఎలా వుందని ప్రశ్నిస్తే, దాదాపు 90శాతం మంది ఏదో ఇలా వుంది.. అంటారేగానీ ధైర్యంగా నేను చదివినదానికి తగిన పని చేస్తున్నానని ఎవ్వడూ అనడు. దీనికి కారణం ఎవరు? అనేది నేను సినిమాలో ప్రశ్నించా.
- మెగాస్టార్ చిరంజీవి సినిమాలో చేయడం నా డ్రీమ్. అది ఆచార్యద్వారా నెరవేరింది. ఇప్పుడు తాజాగా మరో సినిమాలో నటిస్తున్నాను.