Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నా పెళ్లి అలా జరగాలనే కోరుకుంటా: నిహారిక

''హ్యాపీ వెడ్డింగ్'' సినిమాలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారిక నటిస్తున్న సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్ ప్రమోషన్‌లో నిహారిక బిజీబిజీగా వుంది. ఓ ఇంటర్వ్యూ నిహారిక తన

Advertiesment
Niharika
, ఆదివారం, 22 జులై 2018 (10:01 IST)
''హ్యాపీ వెడ్డింగ్'' సినిమాలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన తొలి హీరోయిన్ నిహారిక నటిస్తున్న సంగతి తెలిసిందే. తన తాజా చిత్రం హ్యాపీ వెడ్డింగ్ ప్రమోషన్‌లో నిహారిక బిజీబిజీగా వుంది. ఓ ఇంటర్వ్యూ నిహారిక తన పెళ్లి గురించి కీలక వ్యాఖ్యలు చేసింది. కొందరి వివాహాల్లో జరిగిన చిన్న చిన్న తప్పులు చూశాక.. అలా కాకుండా పద్ధతిగా పెళ్లి చేసుకోవాలనిపిస్తుందని నిహారిక తెలిపింది. 
 
ఆ మధ్య కాలంలో పెదనాన్న చిరంజీవి కుమార్తె సుస్మిత పెళ్లిని బాగా ఎంజాయ్ చేశానని చెప్పిన నిహారిక, తనకు ఊహ తెలిసిన తరువాత ఇంట్లో జరిగిన తొలి పెళ్లి అదేనని, సంగీత్ నుంచి ప్రతి కార్యక్రమమూ ఇంట్లోనే జరుగగా, చాలా అల్లరి చేశానని తెలిపింది. పెళ్లీడుకు వచ్చిన ప్రతి అమ్మాయికి తన పెళ్లి ఎలా జరగాలనే విషయమై కొన్ని కోరికలు వుండటం సహజమని.. తన వరకైతే పద్ధతిగా పెళ్లిచేసుకోవడమే ఇష్టమని చెప్పింది. 
 
ఇక సినిమాల విషయానికి వస్తే, కథకు ప్రాధాన్యత గల సినిమాలే ఎంచుకుంటానని తెలిపింది. పాటకు ముందు వచ్చి.. తర్వాత వెళ్లిపోయే కథలంటే తనకు ఇష్టమండదని.. ఇలా ఎనిమిది స్టోరీలకు నో చెప్పానని నిహారిక స్పష్టం చేసింది. కాగా యంగ్ హీరో సుమంత్ అశ్విన్, మెగా హీరోయిన్ నిహారిక జంటగా న‌టిస్తున్న మూవీ హ్యాపీ వెడ్డింగ్. ఈ చిత్రానికి లక్ష్మణ్ కార్య ద‌ర్శ‌కుడు. ఈ మూవీ ఈ నెల 28న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పల్లెటూరులో షూటింగ్ అంటే పరుగులు తీస్తున్న ప్రిన్స్... ఎందుకంటే?