Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో నిహారిక కొణిదెల-వైవా హర్షల కొత్త వెబ్ సిరీస్

Advertiesment
Niharika
, బుధవారం, 3 మే 2023 (17:14 IST)
Niharika
మెగా ఫామిలీ నుంచి ఫస్ట్ లేడీ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చింది కొణిదెల నిహారిక. హీరోయిన్ గానూ సపోర్ట్ యాక్ట్రెస్ గాను మెప్పించిన నిహారిక త్వరలోనే ఒక న్యూ ఏజ్ కంటెంట్ ఉన్న వెబ్ సిరీస్‌తో రాబోతోంది. డెడ్ పిక్సెల్ అనే టైటిల్‌తో రూపొందిన ఈ సిరీస్ ఈ నెల 19నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సో స్ట్రీమ్ కాబోతోంది.
 
ఇంతకుముందే విడుదలైన ఈ వెబ్ సిరీస్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఒక కొత్త కంటెంట్‌తో వస్తున్నట్టుగా టీజర్ చూడగానే అర్థం అవుతోంది. ముఖ్యంగా ఈ తరం ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించినట్టుగా ఉంది. 
 
ఈ సిరీస్‌లో నిహారిక ఒక గేమర్‌గా నటించింది. ఓ నలుగురు కుర్రాళ్ళు కలిసి ఒక కొత్త తరహా గేమ్‌ను క్రియేట్ చేస్తారు. దానివల్ల వాళ్ళు పొందింది.. పోగొట్టుకుంది ఏంటి అనే కాన్సెప్ట్ తో వస్తోంది టీమ్. 
 
నిహారికతో పాటు వైవా హర్ష, అక్షయ్, సాయి రోనక్, భావన సాగి, రాజీవ్ కనకాల, బిందు చంద్రమౌళి, జయశ్రీ రాచకొండ ఇతర కీలక పాత్రల్లో నటించారు. 
 
సాంకేతిక నిపుణులు   :
ప్రొడక్షన్ హౌస్ : బీబీసీ  స్టూడియోస్ ఇండియా  Pvt  Ltd, Tamada  Media Pvt Ltd.
లైన్ ప్రొడ్యూసర్స్ : అనిల్  కుమార్ తీర్రే, సాయి  వర్మ  వేగిరాజు  (RGV) 
ఎగ్జిక్యూటివ్  ప్రొడ్యూసర్స్ : దీపాలు  హండా , శ్రీ  హర్ష  బసవ 
ప్రొడక్షన్  డిజైనర్ : శివమ్  రావు 
ఎడిటర్ : సృజన  అడుసుమిల్లి 
మ్యూజిక్  డైరెక్టర్ : సిధార్థ  సదాశివుని 
డిఓపి : ఫహద్  అబ్దుల్  మజీద్ 
రైటర్ :  అక్షయ్  పుల్ల 
హెడ్ స్క్రిప్ట్  డెవలప్మెంట్ : (బీబీసీ  స్టూడియోస్) - సిద్ధార్థ్  హిర్వే 
ప్రొడ్యూసర్స్ : సమీర్  గోగతే , సాయిదీప్  రెడ్డి  బొర్రా , రాహుల్ 
డైరెక్టర్ :  ఆదిత్య  మండల

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రిహార్సల్‌లో గాయపడిన చియాన్ విక్రమ్