Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉదయ్ శంకర్, మేఘా ఆకాష్ జోడిగా కొత్త సినిమా

Advertiesment
Uday Shankar clap sriram
, సోమవారం, 27 మార్చి 2023 (15:12 IST)
Uday Shankar clap sriram
ఆటగదరా శివ ఫేమ్  ఉదయ్ శంకర్ హీరోగా కొత్త సినిమా హైదరాబాద్ ఫిల్మ్ నగర్ టెంపుల్ లో ప్రారంభం అయింది. మన్మోహన్ డైరెక్ట్ చేస్తోన్న ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై డాక్టర్ సౌజన్య ఆర్ అట్లూరి సమర్పణలో అట్లూరి నారాయణరావు నిర్మిస్తున్నారు. ముహూర్త షాట్ కు ముఖ్య అతిథులుగా వచ్చిన శ్రీరామ్ సార్ క్లాప్ కొట్టగా..దినేష్ చౌదరి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
 
ఈ సంధర్భంగా నటుడు మధునందన్ మాట్లాడుతూ.. శ్రీరామ్ మూవీస్ ప్రొడక్షన్ లో మరోసారి ఉదయ్ హీరోగా నటిస్తుండటం హ్యాపీగా ఉంది. ఉదయ్ కి ఈ చిత్రం సూపర్ హిట్ ఇస్తుందని చెప్పగలను. ఎందుకంటే ఈ స్క్రిప్ట్ మొత్తం నేను చదివాను. అందుకే ఉదయ్ కి మంచి హిట్ ఇవ్వడంతో పాటు అతన్ని నెక్ట్స్ లీగ్ లోకి తీసుకువెళుతుందనుకుంటున్నాను. శ్రీ రామ్ మూవీస్ బ్యానర్ తో పాటు ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్  ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్యూ..’ అన్నారు.
 
హీరో ఉదయ్ శంకర్ మాట్లాడుతూ..  హీరోగా నాకు ఇది ఐదో సినిమా. ఈ బ్యానర్ లో రెండో సినిమా. నిర్మాత నారాయణరావుగారితో మరోసారి అసోసియేట్ కావడం ఫ్యామిలీ ప్రాజెక్ట్ లాంటిదే. నచ్చింది గర్ల్ ఫ్రెండ్ తర్వాత మధునందన్ తో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ మూవీలో అతనికి చాలా ఇంపార్టెంట్ రోల్. హిలేరియస్ గా సాగే ఎగ్జైటింగ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. మధునందన్ బ్రదర్ తన డెబ్యూ మూవీతో మన్మోహన్ అద్భుతమైన స్క్రిప్ట్ తో వచ్చాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం ఉంటుంది. అతి త్వరలోనే రెగ్యులర్ షూట్ కు వెళ్లబోతున్నాం. మీ అందరి బ్లెస్సింగ్స్, సపోర్ట్ మాకు కావాలి.. ’అన్నారు.
 
దర్శకుడు మన్మోహన్ మాట్లాడుతూ, ఈ మూవీ ఏప్రిల్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగబోతోంది. ఈ షెడ్యూల్ లో మొత్తం కాస్ట్ క్రూ ఉంటుంది. ఇది ఫ్యామిలీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో పాటు ఒక చిన్న ప్రేమకథ కూడా మిక్స్ అయి ఉంటుంది. మీ అందరికీ ఈ కథ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఈ మొత్తం జర్నీలో మీ అందరి సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
 
నిర్మాత నారాయణరావు మాట్లాడుతూ, ఈ మూవీ కథ చాలా బావుటుంది. స్క్రిప్ట్ ఎక్స్ ట్రార్డినరీగా ఉంది. ఉదయ్ శంకర్ తో పాటు హీరోయిన్ మేఘా ఆకాశ్ పాత్రలు చాలా బావుంటాయి. మ్యూజిక్ శ్రీ చరణ్ పాకాల, సినిమాటోగ్రఫీ జాంబిరెడ్డి ఫేమ్ అనిత్ కుమార్ అందిస్తున్నారు. మంచి కాస్ట్ అండ్ క్రూతో వస్తున్న ఈ చిత్రం మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విడాకులపై విష్ణు ఇచ్చిన సమాధానం..