Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నేనెవరు ఆడియో & ప్రోమో విడుదల‌

Advertiesment
Akash Puri-Rahul Vijay, kola balakrshna
, సోమవారం, 19 సెప్టెంబరు 2022 (16:25 IST)
Akash Puri-Rahul Vijay, kola balakrshna
కౌశల్ క్రియేషన్స్ పతాకంపై భీమినేని శివప్రసాద్-తన్నీరు రాంబాబు నిర్మాతలుగా నిర్ణయ్ పల్నాటి దర్శకత్వం వహించిన చిత్రం 'నేనెవరు'. పూనమ్ చంద్-కుమావత్-కిరణ్ కుమార్ మోటూరి సహ నిర్మాతలు. ప్రముఖ ఎడిటర్ స్వర్గీయ కోలా భాస్కర్ తనయుడు కోలా బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సాక్షి చౌదరి హీరోయిన్ కాగా.. తనిష్క్ రాజన్, గీత్ షా సహాయ పాత్రల్లో, బాహుబలి ప్రభాకర్ విలన్ గా నటిస్తున్నారు. రాధ గోపి తనయుడు ఆర్.జి.సారథి ఈ చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 
 
లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో రాజా రవీంద్ర, దిల్ రమేష్, డి.ఎస్.రావు తాగుబోతు రమేష్, వేణు, సుదర్శన్ రెడ్డి, నీరజ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆడియో అండ్ ప్రోమో... ప్రసాద్ ల్యాబ్ లో ఘనంగా జరిగిన వేడుకలో యువ హీరోలు ఆకాష్ పూరి, రాహుల్ విజయ్ విడుదల చేశారు. సీనియర్ నటులు గౌతమ్ రాజు, అశోక్ కుమార్, ప్రముఖ రచయిత నివాస్, నాగబాల సురేష్ కుమార్, రాధ గోపి, సుప్రీంకోర్టు న్యాయవాది వరప్రసాద్, ఆదిత్య ప్రతినిధులు నిరంజన్, మాధవ్ తదితరులు హాజరైన ఈ వేడుకలో ఫస్ట్ గ్లింప్స్ కూడా విడుదల చేశారు.
 
 దర్శకుడిగా నిర్ణయ్ కి, సంగీత దర్శకుడు సారథికి, హీరో బాలకృష్ణకి, నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలని హీరోలు ఆకాష్ పూరి, రాహుల్ విజయ్ ఆకాంక్షించారు. ఈ చిత్రం ఆడియో హక్కులు ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది. ఎడిటర్ గా కోలా భాస్కర్ చివరి చిత్రం "నేనెవరు" కావడం విశేషం

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ధృవ్ సరసన అన్షు.. సాలిడ్ స్క్రిప్ట్‌తో...