Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కన్నడ మహాభారత్‌లో ద్రౌపదిగా నయనతార.. ఒప్పుకుంటే పంట పండినట్లే

ఇటీవల తెలుగు దర్శకుడు జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రాల సిరీస్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయడంతో పాటు భారతీయ సినిమాను, ముఖ్యంగా తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ స్థాయిలో ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ సినిమా నటి నయనతారను పాంచాలిగా మార్చడానికి

కన్నడ మహాభారత్‌లో ద్రౌపదిగా నయనతార.. ఒప్పుకుంటే పంట పండినట్లే
హైదరాబాద్ , బుధవారం, 5 జులై 2017 (05:03 IST)
మన పురాణ ఇతిహాసాల్లో ప్రధానమైన రెండింటిలో ఒకటి మహాభారతం. మానవ విలువలకు అద్దం పట్టే పురాణ ఇతిహాసాన్ని పలు కోణాల్లో ఇప్పటికే తెరపై ఆవిష్కరించారు. ఇక బుల్లితెరపైనా విపులంగా వేల ఎపిసోడ్స్‌తో ప్రచారమై ప్రేక్షకులను అలరించింది. తాజాగా మహాభారతానికి మరోసారి తెరకెక్కే సమయం ఆసన్నమైంది. ఇటీవల తెలుగు దర్శకుడు జక్కన్న చెక్కిన బాహుబలి చిత్రాల సిరీస్‌ ప్రేక్షకులను మెస్మరైజ్‌ చేయడంతో పాటు భారతీయ సినిమాను, ముఖ్యంగా తెలుగు సినిమా కీర్తిని ప్రపంచ స్థాయిలో ఎగురవేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ సినిమా నటి నయనతారను పాంచాలిగా మార్చడానికి ప్రయత్నాలు తీవ్రంగా జరుగుతున్నట్లు తాజా సమాచారం. 
 
దీంతో చారిత్ర కథాచిత్రాలపై దర్శక నిర్మాతల్లో ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో పలు భాషలకు చెందిన ప్రముఖులు ప్రధాన పాత్రలు పోషించనున్నారు. సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‌లో ఈ చిత్రం రూపొందనుంది. 
 
మహాభారత ఇతి వృత్తంతో కన్నడంలోనూ ఒక చిత్రం నిర్మాణానికి సన్నాహాలు చురుగ్గా జరుగుతున్నాయన్నది తాజా సమాచారం. ఎంటీ.వాసుదేవన్‌ రాసిన రెండముళం అనే నవల ఆధారంగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి నాగన్న దర్శకత్వం వహించనున్నారు. ఇందులో దుర్యోధనుడిగా దర్శిన్, కర్ణుడిగా రవిచంద్రన్, భీష్ముడిగా సీనియర్‌ నటుడు అంబరీష్‌ నటించనున్నారు. ఈ చిత్రానికి కురుక్షేత్ర అనే టైటిల్‌ నిర్ణయించారు.
 
ఇక కురుక్షేత్రానికి కీలక పాత్రధారిని పాంచాలిగా అగ్రనాయకి నయనతారను నటింపచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమాచారం. ఇప్పటికే తెలుగు చిత్రం శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ఆ పాత్రలో ఒదిగిపోయిన నయనతార కురుక్షేత్ర చిత్రంలో ద్రౌపదిగా నటిస్తే ఆ చిత్ర స్థాయి పలురెట్లు పెరిగిపోతుందని వేరే చెప్పాలా ‘మరో విషయం ఏమిటంటే నయనతార ఇప్పటికే సూపర్‌ అనే చిత్రం ద్వారా కన్నడ సినీప్రేక్షకులకు పరిచయం అయ్యారు. మరి కురుక్షేత్రకు ఈ భామ ఎస్‌ అంటారా లేదా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చుట్టూ చెంగావి చీర.. కట్టావే చిలకమ్మా.. చీరకట్టులో నిండుగా కాజల్