Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

‘అర్ధ శతాబ్దం’ ట్రైలర్ విడుద‌ల చేసిన నాని

‘అర్ధ శతాబ్దం’ ట్రైలర్ విడుద‌ల చేసిన నాని
, బుధవారం, 2 జూన్ 2021 (16:48 IST)
Artha shatabdam
తెలుగు ప్రేక్ష‌కుల చేతుల్లోకి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది హండ్రెడ్ ప‌ర్సెంట్‌ తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’. ఇందులో జూన్ 11న అంద‌రిలో ఆస‌క్తి పెంచిన చిత్రం ‘అర్ధ శ‌తాబ్దం’ విడుల‌వుతుంది. ‘ఆహా’ ఎక్స్‌క్లూజివ్ మూవీగా విడుద‌లవుతోన్న ఈ చిత్రానికి ర‌వీంద్ పుల్లె ద‌ర్శ‌ర‌కుడు. కార్తీక్ ర‌త్నం, న‌వీన్ చంద్ర‌, సాయికుమార్‌, కృష్ణ ప్రియ‌, శుభ‌లేఖ సుధాక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. అంబేద్కర్ జయంతి రోజున విడుదలైన ఈ టీజర్ మంచి స్పందనను రాబట్టుకుంది. 
 
బుధ‌వారం(జూన్ 2) రోజున ఈ సినిమా ట్రైల‌ర్‌ను నేచుర‌ల్ స్టార్ నాని విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ ప్రేక్ష‌కుల నుంచి ట్రెమెండ‌స్ రెస్పాన్స్‌ను రాబ‌ట్టుకుంది. తెలంగాణ‌లో కుగ్రామ మూలాల్లోని రాజ‌కీయాల‌కు, కుల వ్య‌వ‌స్థ‌కు మ‌ధ్య ఉండే రా ఎమోష‌న్స్‌, ఇన్‌టెన్స్ యాక్ష‌న్‌, ర‌స్టిక్ రొమాన్స్ వంటి ప‌లు అంశాల క‌ల‌యిక‌గా ఈ చిత్రం రూపొందిన‌ట్లు అర్థమ‌వుతుంది. సినిమాలోని రాజ‌కీయ అంశాలు, డ్రామా, మాన‌వ సంబంధాలు, సంగీతం ఇవన్నీ ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. 
 
ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసిన నాని మాట్లాడుతూ ‘‘‘అర్ధ శ‌తాబ్దం’ ట్రైల‌ర్ చాలా ఎంగేజింగ్‌గా ఉంది. సినిమా చూడాల‌నే ఆస‌క్తి పెంచింది. ఆహాలో జూన్ 11న విడుదలవుతుంది. నటీనటులందరూ చక్కగా నటించినట్లు తెలుస్తుంది. ఎంటైర్ యూనిట్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను’’ అన్నారు. 
 
ప్రామిస్ చేసినట్లుగా ఆహా తెలుగు ప్రేక్ష‌కులను తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది. త్వ‌ర‌లోనే ప్రియ‌ద‌ర్శి, నందినీ రాయ్ ప్ర‌ధాన తారాగ‌ణంగా న‌టించిన క్రైమ్ థ్రిల్ల‌ర్ వెబ్ సిరీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ ప్ర‌సారం కానుంది. దీంతో పాటు టోవినో థామ‌స్ ప్ర‌ధాన పాత్ర‌ధారిగా న‌టించిన యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ కాలా జూన్ 4న ఆహాలో విడుద‌ల‌వుతుంది. ఈ ఏడాదిలో ఇప్ప‌టికే వెబ్‌ షోస్‌, లెవ‌న్త్ అవ‌ర్ వంటి ఒరిజిన‌ల్స్‌, మెయిల్, చావు క‌బురు చ‌ల్ల‌గా, క్రాక్‌, జాంబీ రెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు  ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను విందు భోజ‌నంలా వ‌డ్డించింది ‘ఆహా’.
సాంకేతిక నిపుణులు: 
బ్యానర్‌ : రిషితా శ్రీ క్రియేషన్స్‌ ఎల్‌ఎల్‌పీ, 24 ఫ్రేమ్స్‌ సెల్యూలాయిడ్‌
నిర్మాతలు: చిట్టి కిరణ్ రామోజు, తేలు రాధాకృష్ణ
డైరెక్ట‌ర్‌: ర‌వీంద్ర పుల్లె
సినిమాటోగ్ర‌ఫీ:  వెంక‌ట ఆర్‌.శాఖ‌మూరి
సంగీతం:  నోఫెల్ రాజ

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

‘తెలంగాణ దేవుడు’కి శుభాకాంక్షలు