Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొలి విడ‌త‌ద‌గా 500 ఆక్సిజ‌న్ ల‌ను అంద‌జేసిన న‌మ్రత‌

Advertiesment
తొలి విడ‌త‌ద‌గా 500 ఆక్సిజ‌న్ ల‌ను అంద‌జేసిన న‌మ్రత‌
, గురువారం, 20 మే 2021 (17:53 IST)
Namrata-500 oxygen
క‌రోనా కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క ఇబ్బందిప‌డుతున్న వారిని సాయం చేసేవారిలో న‌మ్ర‌త శిరోద్క‌ర్ చేరింది. ఇప్పుడు న‌మ్ర‌త 500 ఆక్సిన్ కాన్‌స‌న్‌ట్రేట‌ర్ల‌ను అవ‌స‌రం నిమిత్తం ముంబైకు పంపించింది. ఇది మొద‌టి విడ‌త అని తెలియ‌జేసింది. ఈ విష‌యాన్ని త‌న సోష‌ల్‌మీడియాలో పోస్ట్ చేసింది. అత్యవసర పరిస్థితికి ఈ ఆక్సిజన్ సాంద్రతలు అవసరమయ్యే కోవిడ్ పాజిటివ్ రోగులు మమ్మల్ని 8451869785 కు కాల్ చేయవచ్చు, లేదా టేగ్ చేయ‌వ‌చ్చ‌ని తెలిపింది.
 
అదేవిధంగా అక్క‌డ ఆమెకు సంబంధించిన టీమ్ కొంద‌రు వున్నారు. వారి సాయంతో అక్క‌డ అవ‌స‌ర‌మైన వారికి అంద‌జేసే ప‌నిలో వున్నారు. ఈ ఆక్సిజన్ సాంద్ర‌త‌ల‌ను ఉచితంగా అంద‌జేస్తున్నాం. వాటిని ఉప‌యోగించిన త‌ర్వాత ద‌య‌చేసి  తిరిగి ఇవ్వ‌గ‌ల‌రు అని పోస్ట్ చేసింది. దీనికి ఇప్ప‌టికే ఆమెకు మంచి స్పంద‌న ల‌భించింది. మంచి ప‌ని చేస్తున్నార‌ని కొంద‌రు నెటిజ‌ర్లు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పుట్టిన‌రోజున మ‌నోజ్ సాయం