Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విలపించిన అమల.. పొెంగిపోయిన నాగార్జున

నాపై అమల మనస్సులో ఇంత ప్రేమ ఉందనేది ఇంతవరకు తెలీలేదని అక్కినేని నాగార్జున అన్నారు. శుక్రవారం విడుదలైన ఓం నమో వెంకటేశాయ సినిమా చూసి ఇంటికెళ్లిన తర్వాత గంటసేపు అమల తనను పట్టుకుని అలా నిలబడిపోయిందని, ఆ

Advertiesment
విలపించిన అమల.. పొెంగిపోయిన నాగార్జున
హైదరాబాద్ , ఆదివారం, 12 ఫిబ్రవరి 2017 (03:21 IST)
నాపై అమల మనస్సులో ఇంత ప్రేమ ఉందనేది ఇంతవరకు తెలీలేదని అక్కినేని నాగార్జున అన్నారు. శుక్రవారం విడుదలైన  ఓం నమో వెంకటేశాయ సినిమా చూసి ఇంటికెళ్లిన తర్వాత గంటసేపు అమల తనను పట్టుకుని అలా నిలబడిపోయిందని, ఆ అద్భుత క్షణాలను నేనెన్నటికీ మర్చిపోలేనని ఆ చిత్ర హీరో నాగార్జున చెప్పారు. ‘‘సినిమా చూసి ఇంటికి వెళ్లిన తర్వాత అమల గంటసేపు ఏడుస్తూనే ఉంది. తన మనసులో నాపై ఎంత ప్రేమ ఉందనేది అప్పుడు అర్థమైంది. నన్ను పట్టుకుని అలా నిలబడింది. ఆ మెమరబుల్‌ మూమెంట్స్‌ని ఎప్పటికీ మరచిపోలేను. నాకు అంతకు మించిన ప్రశంస లేదు’’ అన్నారు నాగార్జున. 
 
శ్రీవారి భక్తుడు హాథీరామ్‌ బావాజీగా ఆయన నటించిన సినిమా ‘ఓం నమో వేంకటేశాయ’.  కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఏ. మహేశ్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదలైంది. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాగార్జున మాట్లాడుతూ – ‘‘చిరంజీవిగారు కూడా సినిమా చూసి కళ్లు చెమర్చాయని చెప్పారు. బాగా చేశావని మెచ్చుకున్నారు.
ఈ సినిమా చిత్రీకరణ సమయంలో నాకు కలిగిన  అనుభవాలను ఆయనతో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంలో పంచుకోబోతున్నాను. ఓ చక్కటి సినిమా చేసినందుకు చాలా తృప్తిగా ఉంది. రాఘవేంద్రరావుగారు, జేకే భారవిలు మూడు నాలుగేళ్లు కష్టపడి ఈ కథ తయారుచేశారు. టీమ్‌ అంతా కష్టపడి పనిచేశారు. అందరికీ నా ధన్యవాదాలు’’ అన్నారు.
 
సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్న దాని ప్రకారం హాథీరామ్‌ బాబాగా నాగార్జున అభినయం అద్భుతం. కొన్ని సీన్స్‌లో కంటతడి పెట్టించారు. అన్నమయ్య, శ్రీరామదాసు ఒక ఎల్తైతే హాథీరామ్‌ బాబా పాత్ర మరో ఎత్తు అనే విధంగా నటించారు. భగవంతుడికి, భక్తుడుకి మధ్య వచ్చే సన్నివేశాల్లో నాగార్జున, సౌరభ్‌ జైన్‌లు జీవించారు. థియేటర్‌లో ఓ సినిమా చూస్తున్నట్టు కాకుండా... తిరుమలేశుడి చరిత్ర తెలుసుకుంటున్న ఓ అలౌకిక ఆనందం కలుగుతుంది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శశికళ రెసార్ట్ ఎమ్మెల్యేల జోక్స్.. సోషల్ మీడియా పేలిపోవాల్సిందే..