Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నాగచైతన్య డేట్ విత్ అనసూయ.. సమంతతో పెళ్లి గురించి ఏమన్నాడు..?

నాగచైతన్య-సమంతల ప్రేమ వ్యవహారంపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. అయితే ఈ వ్యవహారంపై ఎవ్వరూ నోరు మెదపలేదు. అయితే తొలిసారి సమంతతో లవ్వాయణం గురించి నోరు విప్పినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్

నాగచైతన్య డేట్ విత్ అనసూయ.. సమంతతో పెళ్లి గురించి ఏమన్నాడు..?
, శనివారం, 13 ఆగస్టు 2016 (15:34 IST)
నాగచైతన్య-సమంతల ప్రేమ వ్యవహారంపై రోజుకో వార్త పుట్టుకొస్తుంది. అయితే ఈ వ్యవహారంపై ఎవ్వరూ నోరు మెదపలేదు. అయితే తొలిసారి సమంతతో లవ్వాయణం గురించి నోరు విప్పినట్లు టాలీవుడ్‌లో జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రత్యక్షంగా ఒక టీవీ షోలోనే చైతూ ఈ వ్యవహారంపై మాట్లాడినట్లు తెలుస్తోంది. బుల్లితెర నుంచి వెండితెరకు తన అందాలను విస్తరించిన యాంకర్ అనసూయతో ఒక టీవీ ఛానెల్ "ఏ డేట్ విత్ అనసూయ" పేరుతో ఒక షో చేస్తోంది.
 
ఈ టీవీ షోకు తొలి అతిథిగా అఖిల్ వచ్చాడు. ఈ షోకు మంచి స్పందన రావడంతో.. రెండో షోను నాగచైతన్యతో చేసినట్లు సమాచారం. దీనికి కన్ఫామ్ చేస్తూ నాగచైతన్యతో ఉన్న ఒక ఫొటోను అనసూయ పోస్ట్ చేసింది. ఈ కార్యక్రమంలో చైతూ వ్యక్తిగత జీవితం, సమంత గురించి అనసూయ కచ్చితంగా ప్రశ్నించి ఉంటుందని టాక్ వస్తోంది. చైతూ కూడా అనసూయ ప్రశ్నలకు సరిగ్గా సమాధానం చెప్పివుంటాడని..ఈ షో ప్రసారం కోసం టాలీవుడ్ జనమంతా వేచి చూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదేళ్ల చిన్నారికి గుర్తు తెలియని వ్యాధి.. వీరాభిమానిని పరామర్శించిన రామ్!