Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐదేళ్ల చిన్నారికి గుర్తు తెలియని వ్యాధి.. వీరాభిమానిని పరామర్శించిన రామ్!

విశాఖపట్టణంలో మృత్యువుతో పోరాడుతున్న ఐదేళ్ల బాలిక పూర్ణచంద్రికను సినీ హీరో రామ్‌ శుక్రవారం కలిశారు. ఎంవీపీ కాలనీలోని రవికుమార్‌ రెండో కుమార్తె కుందన పూర్ణచంద్రిక పుట్టినప్పటి నుంచి కాళ్లను కదపలేక నానా

ఐదేళ్ల చిన్నారికి గుర్తు తెలియని వ్యాధి.. వీరాభిమానిని పరామర్శించిన రామ్!
, శనివారం, 13 ఆగస్టు 2016 (15:16 IST)
విశాఖపట్టణంలో మృత్యువుతో పోరాడుతున్న ఐదేళ్ల బాలిక పూర్ణచంద్రికను సినీ హీరో రామ్‌ శుక్రవారం కలిశారు. ఎంవీపీ కాలనీలోని రవికుమార్‌ రెండో కుమార్తె కుందన పూర్ణచంద్రిక పుట్టినప్పటి నుంచి కాళ్లను కదపలేక నానా అవస్థలు పడుతోంది. గుర్తు తెలియని వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారి ఇక ఎక్కువ కాలం బతకలేదని వైద్యులు నిర్థారించారు. పూర్ణచంద్రిక టాలీవుడ్ యంగ్ హీరో రామ్‌కు వీరాభిమాని. 
 
తన ఆరాధ్య నటుడు విశాఖలో జరుగుతున్న షూటింగ్‌లో ఉన్నాడని తెలుసుకున్న ఆ బాలిక అతడిని చూడాలని తల్లిదండ్రులని కోరింది. దీంతో తల్లిదండ్రులు యూనిట్ సభ్యులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న రామ్ ఆ బాలిక ఇంటికి వెళ్లాడు. పాప ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. కదలలేని స్థితిలో ఉన్న బాలికను ఒడిలో కూర్చోబెట్టుకుని ముచ్చట్లాడారు. అంతేకాదు పాపకు ధైర్యం చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ ఇంటివాడైన చంటిగాడు : తాజ్‌మహల్ హోటల్‌లో పెళ్లి.. శివబాలాజీ ట్వీట్