Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గౌతమీపుత్ర శాతకర్ణి Vs ఖైదీ నెం.150.. నాగబాబు స్పందన ఏంటి?

సంక్రాంతి సందర్భంగా ''గౌతమీపుత్ర శాతకర్ణి'', మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ హీరో ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా పెద్ద వారే జరిగింది. దీనికితోడు అల్లు అర్జున్, దర్శకుడు క్రిష్‌

Advertiesment
Naga Babu's Advice to Fans on Khaidi vs Satakarni
, శనివారం, 31 డిశెంబరు 2016 (10:33 IST)
సంక్రాంతి సందర్భంగా ''గౌతమీపుత్ర శాతకర్ణి'', మెగాస్టార్ చిరంజీవి 150 సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ హీరో ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా పెద్ద వారే జరిగింది. దీనికితోడు అల్లు అర్జున్, దర్శకుడు క్రిష్‌ల కామెంట్లు అభిమానుల యుద్ధానికి మరింత ఆజ్యం పోశాయి.
 
ఈ వార్‌పై చిరంజీవి సోదరుడు నాగబాబు స్పందించారు. సినిమా అంటే కేవలం హీరోకి మాత్రమే చెందినది కాదన్నారు. వేలాది మంది కష్టపడితేనే ఒక సినిమా రూపుదిద్దుకుంటుందని చెప్పుకొచ్చారు. అలాంటి సినిమా ఫ్లాప్ అయితే వారంతా ఎంతో బాధపడతారని చెప్పారు. 
 
ఒకరి సినిమా హిట్ కావడం కోసం... మరొకరి సినిమా ఫ్లాప్ కావాలని కోరుకోవడం మంచిది కాదని సూచించారు. సోషల్ మీడియాలో నెలకొన్న ఫ్యాన్స్ వార్ సరైంది కాదని చెప్పారు. సినీ పరిశ్రమకు ఇది ఎంత మాత్రం మంచిది కాదని తెలిపారు. 
 
సంక్రాంతికి రిలీజయ్యే అన్ని సినిమాలు సూపర్ హిట్ అయి, అందరికీ సంతోషాన్ని కలిగించాలని ఆకాంక్షించారు. సంక్రాంతి సీజన్‌లో మూడు సినిమాలు విడుదలైనా బ్లాక్‌బస్టర్‌లుగా నిలవగలవు. ఈ పండుగా అందరికీ సంతోషాన్ని, సూపర్‌ హిట్స్‌ను ఇవ్వాలని కోరుకుంటున్నానని పేర్కొన్నాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'రత్తాలు రత్తాలు.. ఓసోసీ రత్తాలు' అంటున్న చిరంజీవి : ఖైదీ నంబర్.150 సాంగ్ రిలీజ్ (ఆడియో ఫుల్ సాంగ్)