రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర చిత్రంలో .. ఓ మై ఫ్రండ్స్ సునో మై శాడ్ స్టోరీ... మై గర్ల్ద్ ఫ్రెండ్ ముజే చోడ్ కె గయా.. మై పాగల్ హోగయా .. అనే సాంగ్ ప్రోమోను చిత్ర యూనిట్ విడుదల జేసింది. సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అను ఇమ్మాన్యుయేల్, ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్ నటిస్తున్నారు. ఇందులో ఎవరి ప్రేమలో మోసపోయాడో ఏప్రిల్ 7, 2023 న థియేటర్ల లో విడుదల చేయనున్న చిత్రం చూస్తే తెలుస్తుందని యూనిట్ చెపుతోంది.
కాగా, పూర్తి పాటను ఫిబ్రవరి 18 న విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూర్చారు. రవితేజ కెరీర్లో ఇది ఒక మాస్ ఎంటర్ టైనర్ గా నిలుస్తుందని సుధీర్ వర్మ చెపుతున్నారు.