తెలుగు చిత్రపరిశ్రమలో ప్రముఖ సంగీత దర్శకుడుగా ఉన్న మోస్ట్ వాంటెండ్ బ్యాచిలర్ దేవీశ్రీ ప్రసాద్ ఇపుడు ఓ ఇంటివాడుకాబోతున్నాడు. 40 యేళ్ల వయసు దాటిన దేవీశ్రీ.. ఇపుడు తన మరదలిని వివాహం చేసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి.
అయితే, తాను పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి తనకు దాదాపు 17 యేళ్ల వరకు వయుస వ్యత్యాసం ఉన్నట్టు తెలుస్తుంది. అయినప్పటికీ మరదలిని వివాహం చేసుకునేందుకు దేవీశ్రీ ప్రసాద్ ఆసక్తి చూపించారు.
ఇరు కుటుంబాల సమక్షంలో వీరి పెళ్లి ఘనంగా జరుగనుందనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే, ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే దేవీశ్రీ ప్రసాద్ స్పందించాల్సివుంది.