Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#Padmavati : ములాయం కోడలు డాన్స్ ఇరగదీశారు... (వీడియో)

ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ సూపర్బ్‌గా డ్యాన్స్ వేశారు. ముఖ్యంగా, సెన్సార్‌కు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న 'పద్మావతి'

Advertiesment
#Padmavati : ములాయం కోడలు డాన్స్ ఇరగదీశారు... (వీడియో)
, గురువారం, 30 నవంబరు 2017 (08:42 IST)
ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ మాజీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణ యాదవ్ సూపర్బ్‌గా డ్యాన్స్ వేశారు. ముఖ్యంగా, సెన్సార్‌కు ముందే వివాదాల సుడిగుండంలో చిక్కుకున్న 'పద్మావతి' చిత్రంలోని ఓ పాటకు ఆమె అద్భుతంగా డ్యాన్స్ చేశారు. యూపీ రాజధాని లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో 'గూమర్' సాంగ్‌కు దీపికా పదుకొనేను తీసిపోకుండా అపర్ణ స్టెప్పులేశారు. అపర్ణ డ్యాన్స్ వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. 
 
ఇది వివాదంగా మారింది. ఆ వెంటనే ఆమెకు సోషల్ మీడియా వేదికగా బెదిరింపులు వచ్చాయి. ములాయం కుటుంబానికి చెందిన కోడలు ఇలా చేయడం సరికాదని రాజ్‌పుత్ కర్ణిసేన వర్గీయులు మండిపడుతున్నారు. ఏ పాటనైతే తాము వ్యతిరేకిస్తున్నామో ఆ పాటపై అపర్ణ డాన్స్‌ చేయడం ద్వారా తమను అవమానపరిచారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 
కాగా, దీపికా పదుకొనే, రణ్‌వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించి, బాలీవుడు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ చిత్రం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు కూడా ఇంకా సర్టిఫికేట్ మంజూరు చేయని విషయం తెల్సిందే. అలాగే, ఉత్తరభారతంలోని బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం ఈ చిత్రం తమతమ రాష్ట్రాల్లో విడుదల కాకుండా నిషేధం విధించారు. 
 
 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

`మేరా భార‌త్ మ‌హాన్‌` షూటింగ్ ప్రారంభం!