Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్వేతాబసు ప్రసాద్ ప్రధాన పాత్రలో "మిక్చర్ పొట్లం"... 19న రిలీజ్

శ్వేతాబసు ప్రసాద్ ప్రధాన పాత్రలో ఎం.వి.సతీష్ కుమార్ దర్శకత్వంలో గోదావరి సినీ టోన్ పతాకంపై కలపటపు లక్ష్మీ ప్రసాద్, కంటే వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ''మిక్చర్ పొట్

Advertiesment
Mixture Potlam
, బుధవారం, 17 మే 2017 (16:00 IST)
శ్వేతాబసు ప్రసాద్ ప్రధాన పాత్రలో ఎం.వి.సతీష్ కుమార్ దర్శకత్వంలో గోదావరి సినీ టోన్ పతాకంపై కలపటపు లక్ష్మీ ప్రసాద్, కంటే వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మించిన చిత్రం ''మిక్చర్ పొట్లం''. భానుచందర్ తనయుడు జయంత్, గీతాంజలి జంటగా నటించిన ఈ చిత్రాన్ని ఈనెల 19వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ.. ''యువ దర్శకులు ఎంవి సతీష్ కుమార్ చెప్పిన కథ నచ్చడంతో మరో మాట లేకుండా సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాం. మా ముగ్గురికి కూడా ఈ సినిమా తొలి అనుభవమే, షడ్రుచుల సమ్మేళనం లా మా మిక్చర్ పొట్లం ఉంటుందని చెప్పారు. పైగా, మా సినిమాకు శ్వేతా బసు ప్రసాద్ మరింత ప్లస్ అయ్యింది. యువత కోరుకునే అన్ని అంశాలు పుష్కలంగా ఉన్నాయి. సుమన్, భానుచందర్, కృష్ణభగవాన్, అలీ తదితర సీనియర్‌లు నటించడం, వాళ్లతో మాకు మంచి అనుబంధం ఏర్పడటం చాలా సంతోషాన్నిచ్చింది. 
 
ఈ నెల 19వ తేదీన రెండు తెలుగు రాష్ట్రాలలో రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. తప్పకుండా సక్సెస్ అవుతామనే ధీమాతో ఉన్నాం. సినిమా కూడా బాగా వచ్చింది ముఖ్యంగా బాలు పాడిన పాట మా సినిమాకు హైలెట్‌గా నిలుస్తుంది అలాగే మాధవపెద్ది సురేష్ వంటి గొప్ప వ్యక్తి మా సినిమాకు సంగీతం అందించడం మరింత సంతోషాన్ని ఇచ్చిందని అన్నారు కె.లక్ష్మీ ప్రసాద్, కంటే వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనివాసరావు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోస్ట్‌ ప్రొడక్షన్‌లో 'దండుపాళ్యం-2'.. సెన్సేషన్ తథ్యమంటున్న దర్శకనిర్మాత