చక్కెర వ్యాధితో బాధపడుతూ వచ్చిన తెలుగు చిత్ర నిర్మాత ఆనందరావు గురువారం కన్నుమూశారు. ఆయనకు వయసు 57 సంవత్సరాలు. ఈయ నిర్మించిన "మిథునం" చిత్రం నంది అవార్డును సైతం గెలుచుకుంది.
చాలాకాలంగా డయాబెటీస్‌తో బాధపడుతూ వచ్చిన ఆనందరావు.. గత కొన్ని రోజులుగా మరింతగా అస్వస్థతకు లోనయ్యారు. దీంతో ఆయనను వైజాగ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆయన పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు. ఆయనకు భార్య పద్మిని, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీలతో ఆయన నిర్మించిన 'మిథునం' చిత్రం నంది అవార్డు కూడా వచ్చింది. ఆయన అంత్యక్రియలు వైజాగ్‌లోని వావిలవలసలో గురువారం మధ్యాహ్నం జరిగాయి. ఈయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాన్ని వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు.