Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జోష్ ఫుల్ గా మిస్సింగ్- ప్రమోషనల్ సాంగ్ షూటింగ్

Advertiesment
జోష్ ఫుల్ గా మిస్సింగ్- ప్రమోషనల్ సాంగ్ షూటింగ్
, శుక్రవారం, 17 సెప్టెంబరు 2021 (18:29 IST)
Harsha Narra, Nikisha Rangwala, Misha Narang
హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా “మిస్సింగ్”. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్ జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో శ్రీని జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ హైదరాబాద్ లో చేశారు. ఈ షూటింగ్ లొకేషన్ లో చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా దర్శకుడు శ్రీని జోస్యుల మాట్లాడుతూ, రెండేళ్ల కిందట స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది. వాస్తవానికి గతేడాది ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు సినిమాను తీసుకొద్దాం అనుకున్నాం. ఐదు రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉండగా లాక్ డౌన్ వచ్చి పడింది. దాంతో సినిమా అలా ఆలస్యమవుతూ వచ్చింది. ఏమైనా మేము పట్టుదలగా సినిమాను కంప్లీట్ చేశాం. ఇవాళ ప్రమోషనల్ సాంగ్ షూటింగ్ చేస్తున్నాం. త్వరలోనే థియేటర్ ల ద్వారా మీ ముందుకు చిత్రాన్ని తీసుకొస్తాం. మంచి హిట్ కొడతాం అనే నమ్మకంతో ఉన్నాం. అన్నారు. 
 
హీరో హర్ష నర్రా మాట్లాడుతూ, ఇవాళ ప్రమోషనల్ సాంగ్ షూట్ చేస్తున్నాం. సింగర్ అనురాగ్ కులకర్ణి ఈ ప్రమోషనల్ సాంగ్ చేస్తున్నారు. ఈ పాట చాలా బాగా వస్తోంది. ఒక వీక్ గ్యాప్ లోనే మీ ముందుకు ఈ పాటను తీసుకొస్తాం. “మిస్సింగ్” ఒక మిస్టరీ థ్రిల్లర్ మూవీ. నాకు తొలి చిత్రంలోనే ఇన్ని వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. త్వరలోనే థియేటర్ లలో మిమ్మల్ని కలుసుకుంటాము. అన్నారు.
 
హీరోయిన్ మిషా నారంగ్ మాట్లాడుతూ, నేను నటించిన తొలి చిత్రం. కానీ నా రెండో చిత్రంగా విడుదల కాబోతోంది. ఈ సినిమాలో అవకాశం రావడం నా అదృష్టం అనుకుంటాను. ఈ మూవీ షూటింగ్ టైమ్ లోనే తెలుగు నేర్చుకున్నాను. “మిస్సింగ్”  మీకు తప్పకుండా నచ్చే సినిమా అవుతుంది. అన్నారు.
 
హీరోయిన్ నికీషా రంగ్వారా మాట్లాడుతూ, మంచి ఔట్ పుట్ కోసం టీమ్ అంతా కష్టపడ్డాం. థియేటర్ లలో మిమ్మల్ని కలుసుకునేందుకు ఎదురుచూస్తున్నాను. ఇంకా పాండమిక్ పూర్తవలేదు. ప్రికాషన్స్ తీసుకుంటూ మా చిత్రాన్ని థియేటర్ లో చూసేందుకు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.
 
నిర్మాతలు భాస్కర్ జోస్యుల, లక్ష్మీ శేషగిరిరావు మాట్లాడుతూ, సినిమాకు మంచి మ్యూజిక్ కుదిరింది. ఓలా ఓలా లాంటి పాటలు ఇప్పటికే మంచి హిట్ అయ్యాయి. ఈ ప్రమోషనల్ సాంగ్ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. వీలైనంత త్వరగా సినిమాను థియేటర్ లలో విడుదల చేస్తాం. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోసం డబ్బింగ్ చెబుతున్న పూజాహెగ్డే