Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మిలియన్ల ఆస్తి సంపాదించా, కానీ ఐ.టీ.కి దొరకను : అనిల్ రావిపూడి

Advertiesment
Anil Ravipudi

డీవీ

, బుధవారం, 22 జనవరి 2025 (15:42 IST)
Anil Ravipudi
నిన్ననే చిత్ర నిర్మాత దిల్ రాజు ఇంటిపై ఇన్ కమ్ టాక్స్ దాడులు జరిగాయి. సంక్రాంతికి వస్తున్నాం సినిమాను ఆయన తీశారు. సరైన లెక్కలు చూపించలేదని అందుకే వివరాలకోసం ఐ.టి.దాడి జరిగిందని అధికారులు మీడియాకు చెప్పారు. మరి ఆ సినిమాకు దర్శకత్వం వహించిన అనిల్ రావిపూడిమీద ఐ.టి. దాడులు ఎందుకు జరగలేదు? అనే ప్రశ్న తలెత్తింది. పటాస్ నుంచి పదేళ్ళలో 8 సినిమాలకు దర్శకత్వం వహించిన ఆయన సంక్రాంతికి వస్తున్నాం సక్సెస్, కలెక్షన్స్ చూసి నేనేనా? ఈ సినిమా తీసింది? అనే అనుమానం కూడా అప్పుడప్పుడు నాకు కలుగుతుంది అంటున్నారు.
 
ఇక పదేళ్ళలో మీరు ఏం సంపాదించారు? అన్నప్రశ్న ఆయన ముందుకు రాగానే, నేను ఒక్కో సినిమాకు అభిమానుల్ని సంపాదించుకుంటున్నా. ఇప్పటివరకు మిలియన్ కు పైగా ప్రేక్షకుల్లో నిలిచిపోయేలా ప్రేమను సంపాదించుకున్నానంటూ తెలివిగా సమాధానమిచ్చారు. ఐ.టి.దాడుల గురించి ప్రస్తావనరాగానే నాపై దాడిచేస్తే వారికి పెద్దగా ఉపయోగం వుండదు. నాకు ఎదురిచ్చి వెళతారేమో అంటూ చలోక్తి విసిరారు. అసలే రైటర్ కమ్ దర్శకుడు కనుక తెలివిగా సమాధానమిచ్చాడు.
 
ఇక సంక్రాంతికి వస్తున్నాం సినిమా విజయం మామూలుగా వుంటుందని అనుకున్నాం. కానీ రోజు రోజుకూ ఆదరణ చూస్తుంటే నమ్మలేని నిజంగా నాకు అనిపిస్తుంది. ఒకప్పుడు పలానా హీరో సినిమాకు ఊళ్ళలో ఎడ్లబళ్ళు కట్టుకుని, ట్రాక్టర్లతో ఫ్యామిలతో వచ్చి సినిమా చూసేవారని విన్నాం. ఇప్పుడు కాలం మారినా కాస్త వాహనాలు ఛేంజ్ అయి అంతకుమించిగా కుటుంబాలు తమ పిల్లలతో థియేటర్ కు వస్తున్నారు. ఈ విషయంలో పదేళ్ళ కెరీర్ దక్కిన అరుదైన గౌరవంగా బావిస్తున్నా అన్నారు. ఆయన పటాస్ అనే సినిమాతో దర్శకుడిగా కెరీర్ మారి రేపటికి అంటే జనవరి 23కి పదేళ్ళు పూర్తవుతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూల్స్ పాటించకపోతే లైసెన్స్ రద్దు చేస్తాం : నందమూరి బాలక్రిష్ణ