మెగాస్టార్ చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ విజేత సినిమా ద్వారా హీరోగా పరిచయమైన విషయం తెలిసిందే. ఈ సినిమా ఆశించిన విజయాన్ని సాధించకపోయినా నటుడుగా మంచి పేరు తీసుకువచ్చింది. ఇక తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ పులి వాసు దర్శకత్వంలో చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది.
ఇదిలావుంటే... కళ్యాణ్ దేవ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అది ఏంటంటే... తన మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. అవును... ఈ మేరకు అంగీకార పత్రంలో సంతకం చేసి అపోలో హాస్పటల్‌కి అందచేసారు. ఈ విషయాన్ని కళ్యాణ్ దేవ్ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు.
అవయదానం చేసేందుకు అభిమానులు, ప్రజల ముందుకు రావాలి. మరణానంతరం అవయవాలను దానం చేసేందుకు ప్రతిజ్ఞ చేశా. మనం ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లేటప్పుడు దేన్నీ వెంటతీసుకెళ్లలేం అని కళ్యాణ్ దేవ్ చెప్పారు.