Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అల్లు స్టూడియోస్‌ని ప్రారంభించనున్న మెగాస్టార్ చిరంజీవి

Advertiesment
Allu studio
, శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (19:24 IST)
Allu studio
గత సంవత్సరం అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి సందర్భంగా, అల్లు అరవింద్ నేతృత్వంలోని ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లో త్వరలో కొత్త ఫిల్మ్ స్టూడియో - అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.
 
ప్రకటన రోజున ఆయన కుమారుడు అల్లు అరవింద్, మనవళ్లు అల్లు అర్జున్, బాబీ అల్లు, అల్లు శిరీష్ హైదరాబాద్‌లో ఫిల్మ్ స్టూడియో నిర్మాణ పనులను ప్రారంభించారు. గండిపేట్‌లో 10 ఎకరాల్లో విస్తరించి ఉన్న అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు అదే రోజున ప్రారంభం అయ్యాయి.
 
ఇటీవలే అల్లు స్టూడియో నిర్మాణ పని పూర్తయింది. స్టూడియో ఇప్పుడు జీవనోపాధిని అందించడానికి సిద్ధంగా ఉంది. అల్లు స్టూడియోస్‌లో చిత్రీకరణ  పనులకు సంబందించిన బిల్డింగ్స్ అందుబాటులో ఉన్నాయి.
 
అల్లు ఫ్యామిలీ ఇచ్చిన మాట ప్రకారం లెజెండరి నటులు  దివంగత అల్లు రామలింగయ్య గారి 100వ జయంతి సందర్భంగా స్టూడియోను గ్రాండ్ గా ప్రారంభించనున్నారు. అల్లు స్టూడియోస్‌ను ప్రారంభించే గ్రాండ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, అల్లు శిరీష్, అల్లు వెంకటేష్ మరియు అల్లు కుటుంబం మొత్తంతో  కలిసి ఈ స్టూడియోలను మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించనున్నారు.
 
ఇప్పుడు హైదరాబాద్‌లోని  సినిమా షూటింగులకి అల్లు స్టూడియో కేరాఫ్ అడ్రెస్ గా మారనుంది. అల్లు స్టూడియోస్ గ్రాండ్ ఓపెనింగ్ చూసేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యు.ఎస్‌.ఎ.లో కార్తికేయ-2 యాభైరోజుల వేడుకలు