మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, హీరో సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ నగరంలోని కేబుల్ బ్రిడ్జిపై ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయిధరమ్ ప్రస్తుతం అపస్మారకస్థితిలో ఉన్నాడు.
హైదరాబాద్ నగరానికి తలమానికంగా ఉండేలా ఈ కేబుల్ బ్రిడ్జీని ఐకియా రోడ్డులో నిర్మించారు. ఈ రోడ్డులో స్పోర్ట్స్ బైక్‌పై వేగంగా వస్తుండటతో ఒక్కసారిగా బైకు అదుపుతప్పడంతో కిందపడిపోయాడు.
ఈ ప్రమాదంలో సాయిధరమ్ తేజ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయన అపస్మారక స్థితిలో ఉన్నట్టు సమాచారం. మాదాపూర్‌లోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు.