Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉపాసన చేసిన పనిని మెచ్చుకుంటున్న మెగా అభిమానులు.. ఏం చేసింది?

ఉపాసన చేసిన పనిని మెచ్చుకుంటున్న మెగా అభిమానులు.. ఏం చేసింది?
, బుధవారం, 17 ఏప్రియల్ 2019 (12:48 IST)
మెగా పవర్ స్టార్ రాంచరణ్ సతీమణి ఉపాసన ఈమధ్య చేసిన ఒక పనిని తెగ మెచ్చేసుకుంటున్నారు అభిమానులు. ఎండాకాలం కావడంతో పాటు ఉక్కపోత ఎక్కువగా ఉండటంతో జనం బయటకు రావాలంటేనే బెంబెలెత్తిపోతున్నారు. మరోవైపు ప్లాస్టిక్ నిషేధం కూడా కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాసన హైదరాబాద్‌లో ఎండలకు తట్టుకోలేక కె.బి.ఆర్ పార్క్ వద్దకు వెళ్లి బండిపై ఉన్న పుదీనా నీళ్లను తాగిందట.
 
ఎండ ఎక్కువగా ఉంది దయచేసి శీతల పానీయాలు తాగండి.. అవసరమైతే కానీ ఎండలో ఎక్కువగా తిరగొద్దంటూ ట్విట్టర్లో ట్వీట్ చేసిందట. పుదీనా నీళ్ళు తాగేటప్పుడు ఉపాసన చేతిలో ప్లాస్టిక్ గ్లాస్ ఉందట. దీంతో అభిమానులు మీరే ఇలా ప్లాస్టిక్‌కు ఎంకరేజ్ చేస్తా ఎలా అని ప్రశ్నించారట. దీంతో తన వ్యక్తిగత సిబ్బందిని పిలిచి పది కుండలను కొని తానెక్కడైతే పుదీన నీళ్లు తాగారో అక్కడకు వెళ్ళి ఆ కుండలను ఇచ్చి రమ్మని, ప్లాస్టిక్ గ్లాస్‌లు కాకుండా గాజు గ్లాసులను వాడమని, లేకుంటే కాగితపు గ్లాసులను వాడమని చెప్పి పంపిదంట. 
 
దీంతో సిబ్బంది ఆ కుండలను ఆ షాపు నడిపే వ్యక్తికి ఇచ్చారు. కుండలను అందించే ఫోటోలను ఫోటో తీసి ట్విట్టర్లో పోస్ట్ చేసిందట. దీంతో అభిమానులు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. మీలా అందరూ పాటిస్తే బాగుంటుందని కితాబిస్తున్నారట అభిమానులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'మా'లో మ‌రో వివాదం - రాజీనామా చేసిన ఎస్వీ కృష్ణారెడ్డి