Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మీరా నాయర్‌ సంధించిన సరికొత్త ‘కామసూత్ర’

Advertiesment
meera nayar kamasutra movie
, మంగళవారం, 15 సెప్టెంబరు 2015 (18:46 IST)
యుక్త వయసుకు వచ్చిన స్త్రీపురుషులకు.. తిండి-నిద్ర తర్వాత ‘కామం’ కూడా అంతే ముఖ్యం. అరవై నాలుగు కళల్లోనూ అత్యంత ముఖ్యమైన కళ ‘కామకళ’. కొన్ని వందల సంవత్సరాల  క్రితమే.. ఈ అంశానికి గల ప్రాధాన్యతను గుర్తించి.. ఈ కళపై అత్యంత శాస్త్రీయంగా ఒక గ్రంధాన్నే రాసి..  ప్రపంచానికి అందించిన ఘనత మన భారతదేశానిది. మన వాత్సాయన మహర్షి రాసిన ‘కామసూత్ర గ్రంధం’ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమైనది మాత్రమే కాదు.. అత్యంత ప్రామాణికమైనది కూడా! 
 
వాత్సాయన విరచిత ‘కామసూత్ర’ను ఆధారంగా చేసుకొని.. దానికి కొంత కాల్పనికత  జోడించి  ‘కామసూత్ర’ పేరుతోనే మీరా నాయర్‌ రూపొందిస్తున్న ‘కామసూత్ర సిరీస్‌’ సైతం ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రజాదరణ పొందుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయ స్థాయిలో పలుమార్లు ప్రతిష్టాత్మక పురస్కారాలందుకొన్న మీరా నాయర్‌ తాజాగా తెరకెక్కించిన ‘కామసూత్ర’ త్వరలో తెలుగులో విడుదలకు సిద్ధమవుతోంది. 
 
నవీన్‌ అండ్రూస్‌, ఇందిరావర్మ, రామోన్‌ తికారం, సరితా చౌదరి, హరీష్‌ పటేల్‌ ముఖ్య తారాగణంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ఏ టేల్‌ ఆఫ్‌ లవ్‌’ అన్నది ట్యాగ్‌లైన్‌. ‘మీరా నాయర్‌ ఫిలింస్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌’ పతాకంపై మీరా నాయర్‌ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెలుగులో రుషి పిక్చర్స్‌ అధినేత బలరాం శర్మ విడుదల చేస్తున్నారు. తార అనే రాణి- మాయ అనే రాజదాసి- రాజసింహ అనే రాజు మధ్య ఏర్పడిన ‘ప్రేమ-కామం-మోహం-ఈర్ష్య-ద్వేషం’ వంటి భావోద్వేగాల  తాలూకు పర్యవసానాల సమ్మేళనంగా రూపొందిన ఈ తాజా ‘కామసూత్ర’లో మీరా నాయర్‌ తనదైన శైలిలో కామక్రీడలోని కొత్త కోణాలను సరికొత్తగా ఆవిష్కరించారు.

Share this Story:

Follow Webdunia telugu