Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంకుల్ మీ నిర్ణయం నచ్చలేదు.. గెలుపోటములు సహజం : మంచు విష్ణు

అంకుల్ మీ నిర్ణయం నచ్చలేదు.. గెలుపోటములు సహజం : మంచు విష్ణు
, సోమవారం, 11 అక్టోబరు 2021 (15:42 IST)
తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో నటుడు ప్రకాష్ రాజ్ ఓడిపోయారు. స్థానికేతరుడు అంటూ ప్రచారం చేసిన ప్రత్యర్థి వర్గం తాము అనుకున్న పనిని విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రకాష్ రాజ్ తమ 'మా' ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదే విషయాన్ని ఆయన 'మా' నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు టెలిగ్రామ్ యాప్ ద్వారా తెలియజేశారు. 
 
తన రాజీనామా నిర్ణయాన్ని ఆమోదించాలని కోరారు. 'మా' ఎన్నికల్లో అద్భుత విజయం సాధించావంటూ మంచు విష్ణును అభినందించారు. 'మా'ను నడిపించేందుకు సకల శక్తులు ప్రాప్తించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు. 'మా'లో సభ్యుడ్ని కాకపోయినా తన అవసరం ఉందనుకుంటే తప్పకుండా మద్దతు ఇస్తానని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు.
 
అయితే, ప్రకాష్ రాజ్ నిర్ణయంపై మా కొత్త అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు సమాధానమిచ్చారు. తనకు అభినందనలు తెలిపిన ప్రకాశ్ రాజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. అయితే 'మా' సభ్యత్వానికి రాజీనామా చేయడం తనకు అసంతృప్తి కలిగించిందని వ్యాఖ్యానించారు.
 
"మీరు నాకుంటే ఎంతో పెద్దవారు. ఒకే నాణేనికి బొమ్మ, బొరుసులా గెలుపోటములు ఉంటాయని మీకు తెలుసు. దీన్ని మనం ఒకేలా స్వీకరిద్దాం. దయచేసి మీరు భావోద్వేగాలకు లోనుకాకండి. మీరు మా కుటుంబంలో ఒక ముఖ్య భాగం. మీ ఆలోచనలు మాకు కావాలి, మనం కలిసి పనిచేయాల్సి ఉంది. 
 
మీరు ఇప్పుడు వెంటనే నాకు బదులు ఇవ్వొద్దని కోరుతున్నాను. త్వరలో నేనే మిమ్మల్ని కలుస్తాను... అప్పుడు అన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఐ లవ్యూ అంకుల్... దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు! మనం ఎప్పటికీ ఒక్కటే!" అంటూ మంచు విష్ణు స్పందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పోసానిని అరెస్టు చేస్తున్నారట, ఎందుకంటే?