Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అహింస నుంచి మల్ల నమృత ఐటం సాంగ్ రాబోతుంది

Ahimsa, Malla Namrita
, ఆదివారం, 23 అక్టోబరు 2022 (18:54 IST)
Ahimsa, Malla Namrita
ద‌ర్శ‌కుడు తేజ, రానా ద‌గ్గుబాటి సోద‌రుడు అభిరామ్ హీరోగా ప‌రిచ‌యం చేస్తూ రూపొందించిన సినిమా `అహింస‌`. యూత్ ఫుల్ లవ్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించి ఆర్పీ పట్నాయక్ ఓ అందమైన జానపద మెలోడి స్టయిల్ లో కంపోజ్ చేశారు. వినగానే మనసుని ఆకట్టుకునేలా వున్న పాటలో అభిరామ్, గీతికా ల కెమిస్ట్రీ చూడముచ్చటగా వుంది. కాల భైరవ, కీర్తన శ్రీనివాస్ ఈ పాటని లవ్లీగా ఆలపించారు. చంద్రబోస్ అందించిన సాహిత్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 
 
తాజాగా ఈ సినిమానుంచి ఐటం సాంగ్ రాబోతుంది. దీపావళి సెలబ్రేషన్స్‌ను ఉర్రూతలూగించేందుకు ఒక పగులగొట్టే పాటగా వుంటుంద‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. అమ్మేసానే అంటూ మల్ల నమృత ఐటంసాగ్‌లో న‌ర్తించింది. బాలీవుడ్‌లో ప‌లు సినిమాల్లో ఐటెం సాంగ్‌లు చేసిన ఈమె సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటూ త‌న అందాల‌ను అభిమానుల‌కు ఆర‌బోస్తుంది కూడా. అమ్మేశానే అన్న పాట రేపు విడుద‌ల‌కాబోతోంది. ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్‌పై పి కిరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రుద్రంగిలో జ్వాలాబాయి దొరసానిగా మమతా మోహన్ దాస్