Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 16 April 2025
webdunia

ఐటమ్ గర్ల్ అంటే పళ్లు రాలగొడతా : మలైకా అరోరా

Advertiesment
Malaika Arora
, శుక్రవారం, 3 మే 2019 (14:27 IST)
బాలీవుడ్ క్వీన్ మలైకా అరోరా అభిమానులకు ఓ వార్నింగ్ ఇచ్చింది. తనను ఐటమ్ గర్ల్ అంటే మాత్రం పళ్లు రాలగొడతానంటూ హెచ్చరింక చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చిత్రం గబ్బర్ సింగ్. ఈ చిత్రంలో కెవ్వు కేక అనే ఐటమ్ సాంగ్‌లో ఈ అమ్మడు తన అందాలను ఆరబోసి నర్తించిన విషయం తెల్సిందే. ఒక చిత్రానికి ఐటమ్ సాంగ్ అంటే ప్రత్యేక ఆకర్షణ అని ఆమె చెప్పుకొచ్చారు. 
 
ఇదే అంశంపై ఆమె తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులు వచ్చాయి. దర్శక-నిర్మాతలు ఇప్పుడు సినిమాల్లో ప్రత్యేక గీతాలు ఉండేలా చూసుకుంటున్నారు. కానీ నా ఆలోచనా విధానం వేరు. ఒక నటీమణికి ప్రత్యేక గీతంలో నర్తించడం ఇష్టం లేనప్పుడు అందుకు అంగీకరించకపోవడమే మంచిది. మంచిది. అయితే ఇలాంటి పాటలను పూర్తిగా నిషేధించాలని నేను చెప్పడం లేదు.
 
ముఖ్యంగా, తాను ఏదేనీ పాటలో నర్తిస్తే దాన్ని అందరూ ఐటం సాంగ్‌ అంటుంటారు. నాకు చాలా కోపం వస్తుంది. ఒకవేళ నన్ను ఎవరైనా 'ఆమె ఐటెం గర్ల్' అని అన్నారంటే పళ్లు రాలగొట్టేస్తాను అని వ్యాఖ్యానించారు. తాను ఇష్టపూర్వకంగానే ప్రత్యేక గీతాల్లో నటిస్తాననీ, ఇందులో ఎవరి బలవంతం కూడా లేదని ఆమె స్పష్టం చేశారు. సినిమాలో కాస్త ఫన్‌ ఉండాలంటే ఇలాంటి పాటలు ఉండి తీరాల్సిందే అని అభిప్రాయపడ్డారు.
 
ఇకపోతే, గతంలో బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ నటించిన 'దిల్ సే'  చిత్రంలో 'ఛయ్య.. ఛయ్యా.. ఛయ్యా’ అనే ప్రత్యేక గీతంతో మలైకా కెరీర్‌ను ప్రారంభించారు. 'దబాంగ్' సినిమాలో 'మున్నీ బద్నామ్ హుయీ'తో పాటు పలు ఇతర పాటలకు నర్తించారు. బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ను త్వరలోనే మలైకా వివాహం చేసుకోబోతున్నట్లు బాలీవుడ్ వర్గాలు కోడైకూస్తున్నాయి. కానీ, వారిద్దరూ మాత్రం ఈ వార్తలపై పెదవి విప్పడం లేదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఛీ..ఛీ.. ఏంటీ బూతు ట్రైలర్... స్టేజ్ మీదే డైరెక్ట‌ర్‌ని తిట్టేసిన జీవిత..‌.