Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటుడు కాకుండా నేను మరొకటా... బాబో భయంకరంగా ఉంది... మహేష్‌ బాబు

మహేష్‌ అంటేనే గ్లామర్‌.. ఒక్కసారి.. ఇంకొక్కసారి తిరిగిచూడు అంటూ.. సీతమ్మ వాకిట్లో చిరుమల్లె చెట్టు చిత్రంలో ఓ అమ్మాయి.. మహేష్ బాబుతో అంటుంది. అలాంటివే మహేష్‌ షూటింగ్‌లోనూ జరుగుతుంటాయి. ''బ్రహ్మోత్సవం'' సినిమాలో తనను అదేపనిగా చూసేవారు వున్నారంటున్న మహ

Advertiesment
నటుడు కాకుండా నేను మరొకటా... బాబో భయంకరంగా ఉంది... మహేష్‌ బాబు
, శనివారం, 14 మే 2016 (18:39 IST)
మహేష్‌ అంటేనే గ్లామర్‌.. ఒక్కసారి.. ఇంకొక్కసారి తిరిగిచూడు అంటూ.. సీతమ్మ వాకిట్లో చిరుమల్లె చెట్టు చిత్రంలో ఓ అమ్మాయి.. మహేష్ బాబుతో అంటుంది. అలాంటివే మహేష్‌ షూటింగ్‌లోనూ జరుగుతుంటాయి. ''బ్రహ్మోత్సవం'' సినిమాలో తనను అదేపనిగా చూసేవారు వున్నారంటున్న మహేష్‌.. భారీ తారాగణం మధ్య షూటింగ్‌.. చాలామంది వున్నారు.. అందరినీ చూసి.. ఇంతమంది ఆర్టిస్టులా అని నాకే ఆశ్చర్యమేసిందని చెబుతున్నారు. 
 
ఈ నెల 20న విడుదల కాబోతున్న సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఒకవైపు కథానాయికలు మహేష్‌ గురించి.. గొప్పగా చెబుతుండగా.. ఆయన డబ్బింగ్‌ చెప్పి.. గురువారం నాడే ప్రమోషన్‌ ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో ఆర్భాటంగా వేసిన సెట్లో ఆయన ప్రముఖ చానల్స్‌కు ఇంటర్వ్యూలు ఇచ్చారు.  
 
ఈ సినిమాలో 'మధురం మధురం' అనే పాటలో మహేష్‌ బాబును పెళ్లి చేసుకుంటావా అని అడిగిన అవంతిక చేత ఇంటర్వ్యూ చేయించింది చిత్ర యూనిట్‌. చిత్ర విశేషాలను ఆయన చెబుతూ..  సెట్‌ కొచ్చినపుడు చాలామంది నటులను చూసి భయమేసిందని, ఒకటిరెండు రోజుల తర్వాత అలవాటైందని అన్నాడు. తను 'సూపర్‌ హీరో' పాత్రలను చేయాలనుకోవడం లేదని అన్నారు. సెట్స్‌‌లో ఉన్న సమయంలో ఓ బాటిల్‌లో తాగుతుంటారు. దానికి ఏమైనా ప్రత్యేకత ఉందా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదు. 
 
ప్లాస్టిక్‌ వాడకూడదు గనుక, గ్లాస్‌ బాటిల్‌‌లో మంచి నీళ్ళు తాగుతుంటానని, అంతకుమించి ఏమీ లేదని చెప్పుకొచ్చారు. తనకు రోడ్‌ సైడ్‌ పానీపూరీ వంటివి ఇష్టం ఉండవని, అందుకని అలాంటి వాటి జోలికెళ్ళనని చెప్పిన మహేష్‌, చిన్నతనంలో సరదాగా తన తండ్రి ఏం చెప్తే అది చేసానని, అయితే అంత అవగాహన కూడా లేదని, నటుడిగా కాకుండా మరొకటి అన్న ఆలోచనే భయకరంగా ఉంటుందని, తన చిన్నతనంలోనే నటుడు కావాలన్న నిర్ణయం జరిగిపోయిందని వెల్లడించారు.
 
ఇక మీ సూపర్‌ హీరో ఎవరు అనే దానికి బదులిస్తూ..  హాలీవుడ్‌ 'హల్క్‌' అంటే ఇష్టమని చెప్పాడు. అంతేకాకుండా అటువంటి పాత్ర చేయడానికి ఎప్పుడూ సిద్ధమేనని చెప్పాడు. దానితో పాటు 'అవెంజర్స్‌' సినిమా అంటే చాలా ఇష్టమని అని తన పిల్లలతో కలిసి చాలాసార్లు చూశానని వెల్లడించాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్ అప్పుడు రేణూ దేశాయ్‌కి ఇచ్చాడు... ఇప్పుడు శ్రుతి హాసన్‌కు కూడా... ఏంటది?